Widgets Magazine

ఆ.... అని ఆశ్చర్యపరచిన నాని 'అ' టీజర్(వీడియో)

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత యేడాది మూడు విజయాలు నమోదు చేసుకుని, ఈ సంవత్సరంలోనూ అదే జోరును కొనసాగించడానికి సిద్ధమవుతున్నాడు. ఎప్పుడో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెండితెరకు పరిచయమ

Kajal Agarwal
Mohan| Last Updated: గురువారం, 4 జనవరి 2018 (18:12 IST)
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత యేడాది మూడు విజయాలు నమోదు చేసుకుని, ఈ సంవత్సరంలోనూ అదే జోరును కొనసాగించడానికి సిద్ధమవుతున్నాడు. ఎప్పుడో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెండితెరకు పరిచయమైన నాని హీరోగానూ సక్సెస్ అయ్యాడు. ఇదే ఊపులో ఈ సంవత్సరం "అ" అనే సినిమాకు నిర్మాతగానూ మారాడు. ఈ చిత్రం వాల్‌పోస్టర్ బ్యానర్‌లో తానే స్వయంగా నిర్మిస్తున్నాడు. 
 
షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు నాని. ఈ చిత్రంలోని ఒక్కో పాత్రకు సంబంధించిన పోస్టర్‌లను ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తూ, సినిమాపై అంచనాలను పెంచేసాడు నాని. ఈ సినిమా టీజర్ రిలీజ్ పోస్టర్ ఇప్పటికే నెట్‌లో హల్చల్ చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాని తానే నిర్మిస్తానని నిర్మాతగానూ మారాడు. తాజాగా రిలీజైన సినిమా టీజర్‌ మామూలుగా లేదు. 
 
ఈ టీజర్‌లో కనిపించే చేప పాత్రకి నాని వాయిస్ ఓవర్ ఇవ్వగా, చెట్టు పాత్రకు మాస్‌ మహారాజ్ రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ చిత్రం మొత్తం తొమ్మిది పాత్రల చుట్టూ తిరుగుతుంది. అందుకు అనుగుణంగానే భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బా, మురళీ శర్మ, రోహిణీ, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రాహకిడిగా పనిచేస్తున్నారు. నానికి ఎంతో అచ్చొచ్చిన ఫిబ్రవరి మాసంలో ఈ చిత్రం రిలీజుకి సిద్ధమైంది. మరోపక్క నాని "కృష్ణార్జునయుద్ధం" సినిమాతో బిజీగా ఉన్నాడు. నాని ఇకపై నిర్మాతగానూ సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. చూడండి... ఆ టీజర్...


దీనిపై మరింత చదవండి :