Widgets Magazine

'రాజరథం' రెడీ టు రిలీజ్... మార్చి 23న విడుదల

'రాజరథం' నుండి ముచ్చటగా మూడో పాట 'చల్ చల్ గుర్రం' నేడు విడుదలైంది. చిత్రానికి పనిచేసేవారి ఆకట్టుకునే నైపుణ్యంతో, ఉన్నత ప్రమాణాలతో ఆకర్షిస్తున్న 'రాజరథం' ఈ పాటతో మరోసారి ఆశ్చర్యపరచనుంది. ఎన్నో సినిమాలకి, ఎంతోమందికి డబ్బింగ్ చెప్పిన ప్రముఖ నటుడు రవిశంక

Rajaratham
ivr| Last Modified శుక్రవారం, 9 మార్చి 2018 (21:01 IST)
'రాజరథం' నుండి ముచ్చటగా మూడో పాట 'చల్ చల్ గుర్రం' నేడు విడుదలైంది. చిత్రానికి పనిచేసేవారి ఆకట్టుకునే నైపుణ్యంతో, ఉన్నత ప్రమాణాలతో ఆకర్షిస్తున్న 'రాజరథం' ఈ పాటతో మరోసారి ఆశ్చర్యపరచనుంది. ఎన్నో సినిమాలకి, ఎంతోమందికి డబ్బింగ్ చెప్పిన ప్రముఖ నటుడు రవిశంకర్ మొట్టమొదటిసారి 'రాజరథం'లో తను పోషిస్తున్న 'అంకుల్' పాత్ర కోసం 'చల్ చల్ గుర్రం' పాట పాడారు.

ఈ పాటని మహాబలేశ్వర్, పూణేలోని మాల్షెజ్ ఘాట్ వంటి అందమైన ప్రదేశాలలో కనువిందుగా చిత్రీకరించారు. దర్శకుడు అనూప్ భండారి సహజమైన మంచు కోసం మాల్షెజ్ ఘాట్ ని ఎంచుకున్నారు. ఒకోసారి మంచు తీవ్రత తగ్గేవరకూ ఆగి షూటింగ్ చేసుకోవాల్సి వచ్చేది.

'రాజరథం' కోసం దిలీప్ రాజ్ ప్రత్యేకంగా డిజైన్ చేసి తయారుచేసిన పాతకాలపు సైడ్ కార్ ఉండే స్కూటర్ ఈ పాటకి అదనపు ఆకర్షణ. ఈ స్కూటర్ మనల్ని పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లడం ఖాయం.

ఇప్పటివరకు విడుదలైన రెండు పాటల ట్యూన్లతో సరిపోయేలా ఉండే ఈ 'చల్ చల్ గుర్రం' సాహిత్యంలో చాల అరుదైన తెలుగు పదాలని సినిమా కథకి సరిపోయేలా ఉపయోగించారు. రామజోగయ్య శాస్త్రి గారి పదాల అల్లిక, అనూప్ భండారి స్వరపరిచిన బాణీ వలన ఈ పాట వీనులవిందుగా ఉంటూ సాహిత్యపరంగా ప్రత్యేకతని చాటుకుంది.

నృత్య దర్శకులు బోస్కో - సీజర్ పర్యవేక్షణలో కనువిందు చేసేలా రూపొందిన ఈ పాటలో స్థానిక పల్లెజనాలు కూడా పాలుపంచుకున్నారు. నిరూప్ భండారి, అవంతిక శెట్టి, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించి, అనూప్ భండారి దర్శకత్వంలో, 'జాలీ హిట్స్' నిర్మాణంలో తెరకెక్కిన 'రాజరథం' ప్రపంచవ్యాప్తంగా మార్చి 23న విడుదల కానుంది.


దీనిపై మరింత చదవండి :