Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.18.70 కోట్లు

ఆదివారం, 1 అక్టోబరు 2017 (20:02 IST)

Widgets Magazine
anil kumar singhal

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు శోభాయమానంగా జరిగాయి. ఆదివారం ఉదయంతో జరిగిన చక్రస్నానంతో ఈ వేడుకలు ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.18.70 కోట్లుగా వచ్చినట్టు చెప్పారు. 
 
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలు, మూలవిరాట్ దర్శనం కల్పించామని చెప్పారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సూచనలు చేశారని తెలిపారు. 
 
ఈ బ్రహ్మోత్సవాల్లో 6.27 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని, రూ.18.70 కోట్ల హుండీ ఆదాయం లభించిందని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం తగ్గిందన్నారు. 
 
23 లక్షల మందికి అన్న ప్రసాదం, 26.55 లక్షల లడ్డూలు పంపిణీ చేశామని,3.06 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. 
 
ఈ నెల 18, 25 తేదీల్లో నాలుగు వేల మంది వయోవృద్ధులు, వికలాంగులకు, ఈ నెల 19, 26 తేదీల్లో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ttd Eo Ttd Brahmotsavam 2017 Hundi Income Anil Kumar Singhal

Loading comments ...

వెబ్‌దునియా స్పెషల్ 08

news

శ్రీవారికి వైభవంగా చక్రస్నానం (Video)

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు చక్రస్నాన ఘట్టం అత్యంత వైభవంగా ...

news

అద్భుతం.. శ్రీవారి బ్రహ్మోత్సవాల స్వాగత దీపాలను చూడండి( వీడియో)

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు ...

news

వైభవోపేతంగా శ్రీవారి రథోత్సవం (వీడియో)

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఉదయం స్వామివారి రథోత్సవం ...

news

చంద్రప్రభ వాహంపై తిరుమలేశుడు(వీడియో)

శుక్రవారం రాత్రి బ్రహ్మోత్సవంలో తిరుమల శ్రీవారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. చంద్రుడు ...

Widgets Magazine