Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చీఫ్ జస్టిస్ అభిశంసన : సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌కు చుక్కెదురు

మంగళవారం, 8 మే 2018 (12:04 IST)

Widgets Magazine

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను అభిశంసించాలని రాజ్యసభలో నోటీసులిచ్చి విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ఇపుడు ఏకంగా అత్యున్నత న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది. తమ నోటీసులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, పలువురు కాంగ్రెస్ ఎంపీలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మంగళవారం పిటినష్‌ను విచారించిన ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం, దాన్ని తోసిపుచ్చింది.
Dipak Misra
 
నిబంధనల మేరకే ఉపరాష్ట్రపతి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడిన అత్యున్నత ధర్మాసనం, పిటిషన్‌పై తదుపరి విచారణ ఉండబోదని తేల్చిచెప్పింది. ఈ విషయమై రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ వినతినీ తోసిపుచ్చింది. విషయాన్ని పార్లమెంట్ వేదికగానే తేల్చుకోవాలని సూచించింది. మీకు మీరుగానే పిటిషన్‌ను వెనక్కు తీసుకోవాలని సూచన చేయగా, ఆపై తమ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నామని కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనానికి తెలిపారు. దీంతో చీఫ్ జస్టిస్ అభిశంసన తీర్మానం అశంలో కాంగ్రెస్ భంగపాటుకు గురైంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
చీఫ్ జస్టిస్ అభిశంసన తీర్మానం పిటిషన్ Judges Plea Reject సుప్రీంకోర్టు Suprme Court Chief Justice Impeachment Move

Loading comments ...

తెలుగు వార్తలు

news

మానవత్వమా.. నీ చిరునామా ఎక్కడ? భార్య శవాన్ని భజాలపై మోసుకెళ్లిన భర్త... (వీడియో)

సమాజంలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రభుత్వ దావఖానాల్లో చనిపోయే తమ ఆప్తులను ...

news

ప్రధాని నరేంద్ర మోడీవి దిగజారుడు మాటలు : మన్మోహన్

ప్రధాని నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాటలతో దాడి చేశారు. కర్ణాటక ఎన్నికల ...

news

ఇష్టం లేని పెళ్లి చేశారనీ.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన నవవధువు

తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారన్న కోపంతో అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తను తన ...

news

ఓటుకు నోటు కేసు: ఆ గొంతు చంద్రబాబుదే.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌.. కేసీఆర్ ఏమన్నారంటే?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో టేపులో ...

Widgets Magazine