Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒబామా-మానుషి చిల్లార్‌ను కలిస్తే రాయరు.. ఫేక్ న్యూస్‌ కోసం?: పూనమ్ కౌర్

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (09:16 IST)

Widgets Magazine

మీడియాపై సినీ నటి పూనమ్ కౌర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా ఎప్పుడూ టీఆర్పీ రేటింగ్ కోసమే పాకులాడుతుందని పూనమ్ కౌర్ ధ్వజమెత్తారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలపై ఎప్పుడూ శ్రద్ద చూపని మీడియా.. తప్పుడు వార్తలను రాసేందుకు మాత్రం చాలా ఆసక్తిని చూపిస్తోందని విమర్శించారు.

చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా, స్వచ్ఛంద సేవకురాలిగా తాను అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాను, విశ్వసుందరి మానుషి చిల్లార్‌ను కలిశానని ఆ విషయాలను మీడియా ఏమాత్రం పట్టించుకోలేదని పూనమ్ వ్యాఖ్యానించారు. కానీ తప్పుడు వార్తలు రాసేందుకు మాత్రం మీడియా ఉవ్విళ్లూరుతోందని అన్నారు. 
 
నటి శ్రీదేవి చనిపోయినప్పుడు కూడా ఎన్నో కల్పిత కథలు సృష్టించారని పూనమ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం రెండే రెండింటి కోసం పోరాటాలు జరుగుతున్నాయన్నారు. అందులో ఒకటి ఓటు కోసం కాగా, రెండోది నోటు కోసమని చెప్పారు. ఈ రెండింటి గురించి తప్ప మరి దేని గురించి ఎవరూ మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం, సంస్కృతి గురించి పట్టుకున్న వారే కరువయ్యారన్నారు. ఓ ఇంటర్వ్యూలో పూనమ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.
 
చంద్రబాబు వల్లే తాను ''నిఫ్ట్'' వంటి విద్యాసంస్థలో చదువుకోగలిగానని, ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటానన్నారు. చంద్రబాబు అంటే తనకు ఎంతో గౌరవమని, హైదరాబాద్‌కు ఉన్నత విద్యాసంస్థలను తీసుకొచ్చింది ఆయనేనని పూనమ్ కొనియాడారు. కాశ్మీర్, విశాఖలో జరిగిన ప్రకృతి విధ్వంసాలపై విరాళాల కోసం స్వచ్ఛంధంగా పనిచేశానని పూనమ్ చెప్పారు. అవన్నీ మీడియా ఏమాత్రం పట్టించుకోలేదని, ఫేక్ న్యూస్‌పై మీడియాలో చర్చోపచర్చలు జరుగుతాయని పూనమ్ ఆవేదన వ్యక్తం చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రజాప్రతినిధుల్లోనూ రేపిస్టులు.. బీజేపీకి చెందినవారే అత్యధికం?

ప్రజాప్రతినిధుల్లో రేపిస్టులు వున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ...

news

పవన్‌కు ప్యాకేజీ ఇస్తే చాలు.. మసాజ్ చేసేందుకు బెంగాలీ అమ్మాయిలు కావాలి..

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌ పెను సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి ...

news

సిరియా సంక్షోభం: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం కండి: రష్యా మీడియా

సిరియా సంక్షోభం మూడో ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉంది. మూడో ప్రపంచ ...

news

పీకేజీ.. ఆంధ్రప్రదేశ్ కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారు?: శ్రీరెడ్డి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించింది. టాలీవుడ్ కాస్టింగ్ ...

Widgets Magazine