Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ జంట నిండు నూరేళ్లూ జీవించాలి : ఐఏఎస్ టాపర్స్‌కు రాహుల్ శుభాకాంక్షలు

మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (16:52 IST)

Widgets Magazine
tina dabi - shafi

ఇటీవల మతాంతర వివాహం చేసుకున్న ఓ యువ జంటను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందించారు. ఈ జంట నిర్ణయం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆయన కోరారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. 
 
దళిత సామాజికవర్గానికి చెందిన టీనా దబీ అనే 24 ఏళ్ల యువతి 2015లో ఐఏఎస్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి వార్తల్లో నిలిచింది. అదే పరీక్షలో అథర్ అమిర్‌ ఉల్ షఫీ (25) అనే యువకుడు రెండో ర్యాంక్ సాధించాడు. షఫీ కాశ్మీర్‌కు చెందిన యువకుడు. 
 
వీరిద్దరూ ఢిల్లీలోని కేంద్రసిబ్బంది శిక్షణా సంస్థలో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ప్రేమలో పడ్డారు. మొదట వీరి ప్రేమపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోని టీనా - షఫీ ఇటీవల పెద్దల సమక్షంలో దక్షిణ కాశ్మీర్‌లో ఒక్కటయ్యారు. 
 
ఈ జంటకు రాహుల్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. "వారి ప్రేమబంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అసహనం, విద్వేషం పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నానని, గాడ్‌ బ్లెస్‌ యూ" అని రాహుల్‌ పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ కళ్యాణ్‌‌ను టార్గెట్ చేసిన టిడిపి.. ఎలా?

తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ పైన తీవ్రస్థాయిలో ...

news

మోడీకి మతి లేదు... ఆయన మా శత్రువు: ఉపముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు (Video)

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ఎపి ఉప ముఖ్యమంత్రి కె.ఈ.క్రిష్ణమూర్తి. ...

news

జయలలిత మృతి.. అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డికి సమన్లు.. విచారణకు రావాలని?

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ సీ రెడ్డిని విచారించాలని ...

news

''ఐటమ్ గర్ల్''గా ఛాన్స్ ఇస్తానని అత్యాచారం- వేరే యువతికి ఛాన్స్.. కేసు కొట్టివేత?

భోజ్‌పురి సినీ దర్శకుడు రాంకుమార్ కుమావత్ (51)పై వర్ధమాన నటి పెట్టిన అత్యాచారం కేసును ...

Widgets Magazine