Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఘనంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు- అదిరిన సైనిక పరేడ్..

శుక్రవారం, 26 జనవరి 2018 (10:58 IST)

Widgets Magazine

దేశ 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా పది ఆసియా దేశాలకు చెందిన అధినేతలు ఢిల్లీలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హాజరయ్యారు. ఢిల్లీ రాజ్ పథ్‌లో నిర్వహించిన సైనిక పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. బైకులపై జవాన్లు చేసిన విన్యాసాలు కూడా ఆకర్షించాయి. 
 
వంద అడుగుల భారీ వేదికపై ఆసీనులైన పదిదేశాల అధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆహ్వానం పలికారు. ఆపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాధిపతులు వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రాజ్ పథ్‌కు రావడంతో గణతంత్ర వేడుకలు అధికారికంగా మొదలయ్యాయి.
 
ఈ వేడుకల్లో భారత సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తూ, వివిధ రకాల అత్యాధునిక క్షిపణులు, సైనికుల విన్యాసాలతో సాగిన పరేడ్‌ను ప్రజలతో పాటు పది దేశాల అధినేతలు కన్నార్పకుండా తిలకించారు. అతిథుల భద్రత నిమిత్తం 60 వేల మంది సిబ్బందిని కేంద్రం ఏర్పాటు చేసింది. ఢిల్లీ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ సహా వివిధ విభాగాలు భాగస్వామ్యమయ్యాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యాంకర్‌కు వేధింపులు- పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి.. చివరికి?

టీవీ యాంకర్‌కు వేధింపులు తప్పలేదు. వేరొక వ్యక్తితో వివాహం జరిగినా ఆ యాంకర్‌ను ఓ వ్యక్తి ...

news

రిపబ్లిక్ డే స్పెషల్ : భారత రాజ్యాంగ రచనా భారమంతా ఎవరిదో తెలుసా?

మనకు 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అయితే వాస్తవానికి ఆ రోజు నుంచే పూర్తిగా ...

news

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు: భద్రత వలయంలో హస్తినాపురి

దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్స వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం ...

news

శిల్పాల త‌యారీలో డిజిట‌ల్ టెక్నాల‌జీ... మంత్రి అఖిల ప్రియ‌ను క‌లిసి వివ‌రించిన శిల్పులు

అమ‌రావ‌తి: శిల్పాల త‌యారీలో ఇపుడు డిజిట‌ల్ టెక్నాల‌జీ ముఖ్య పాత్ర పోషిస్తోంద‌ని ...

Widgets Magazine