Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రధాని నరేంద్ర మోడీవి దిగజారుడు మాటలు : మన్మోహన్

మంగళవారం, 8 మే 2018 (10:23 IST)

Widgets Magazine

ప్రధాని నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాటలతో దాడి చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మన్మోహన్ సింగ్ సోమవారం కేపీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, సమాజాన్ని చీల్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
manmohan singh
 
'ఇంతవరకు ఏ ప్రధానీ తన ప్రత్యర్థుల గురించి మోడీ మాట్లాడినట్లు మాట్లాడలేదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో ఆయన వాడుతున్న భాష దిగ్భ్రాంతికరం. పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నారు. ఇది దేశానికి మంచిది కాదు. కర్ణాటక జనాభాను మతప్రాతిపదికన చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇకనైనా ఆయన గుణపాఠం నేర్చుకుని సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయరని ఆశిస్తున్నాను' అని వ్యాఖ్యానించారు. 
 
బ్యాంకింగ్‌ రంగంపై ప్రజలకున్న నమ్మకం రానురాను క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. 'దేశంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. ఆర్థికరంగం మందగమనంతో నడుస్తోంది. ఇవన్నీ నివారించదగినవే. కానీ ఈ సవాళ్లను ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరు చూస్తే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
పైగా, ప్రతి దానికీ యూపీఏను, 70 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను విమర్శించడం సులువైందన్నారు. 2013 తర్వాతే ఎన్‌పీఏలు అపరిమితంగా పెరిగిపోయాయనే విషయం ప్రధాని మోడీ గుర్తించాలని హితవు పలికారు. ప్రధాని దావోస్‌ వెళ్లినప్పుడు నీరవ్‌ ఆయనతో పాటు ఉన్నారని తర్వాత కొద్దిరోజులకే దేశం వదిలి పారిపోయారని ఈ మాజీ ప్రధాని వ్యాఖ్యానించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇష్టం లేని పెళ్లి చేశారనీ.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన నవవధువు

తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారన్న కోపంతో అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తను తన ...

news

ఓటుకు నోటు కేసు: ఆ గొంతు చంద్రబాబుదే.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌.. కేసీఆర్ ఏమన్నారంటే?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో టేపులో ...

news

మోదుకూరులో దారుణం.. ఏడేళ్ల బాలికను రేప్ చేసిన 23యేళ్ల కామాంధుడు

గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన గురించి ఇంకా ఏ ఒక్కరూ ...

news

మోడీని దేశ ప్రధానిగా చేసి పశ్చాత్తాప పడుతున్నా : రాంజెఠ్మలానీ

ప్రధాని నరేంద్ర మోడీపై రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సీనియర్ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ ...

Widgets Magazine