Widgets Magazine

మే 17 లేదా 18న కర్ణాటక సీఎంగా ప్రమాణం చేస్తా : యడ్యూరప్ప

సోమవారం, 30 ఏప్రియల్ 2018 (09:02 IST)

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇంకా జరగనేలేదు. ఓటింగ్ ఇంకా 12 రోజులు ఉన్నాయి. మే నెల 12వ తేదీన పోలింగ్ జరుగనుంది. 15వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా, కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
bs yaddyrappa
 
ఇలా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం కొనసాగుతుండగానే తామే కాబోయే సీఎంలమంటూ ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రకటించేసుకున్నారు. అంతేనా, ఏకంగా ప్రమాణ స్వీకార ముహూర్తాలు పెట్టేసుకున్నారు. వారు ఏం చెప్పారో చూద్దాం.. తమతమ ప్రమాణ స్వీకారాలపై యడ్యూరప్ప (బీజేపీ,), (కాంగ్రెస్), కుమార స్వామి (జేడీఎస్)లు ఏమంటున్నారో తెలుసుకుందాం. 
 
బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప స్పందిస్తూ, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడం, బీజేపీ గెలవడం తథ్యం. నేను మే 17 లేదా 18వ తేదీల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ, లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు, మద్దతుదారుల సమక్షంలో సీఎంగా బాధ్యతలు చేపడుతానంటూ ప్రకటించారు. 
 
ఇకపోతే, ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ, చాముండేశ్వరి, బాదామి నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తా. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. ఫలితాల అనంతరం వారంలోగా నేనే మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడతానంటూ ప్రకటించారు.

అలాగే, జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామి కూడా ఇదే తరహా ధీమాను వ్యక్తం చేశారు. 'మా జేడీఎస్‌ పార్టీ జయకేతనం ఎగురవేయటం ఖాయం. మే 18న మా నాన్న హెచ్‌డీ దేవెగౌడ జన్మదినం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నా తండ్రికి బహుమతిగా ఇస్తా' అంటూ వ్యాఖ్యానించారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
కర్ణాటక ఎన్నికలు బీఎస్ యడ్యూరప్ప సిద్ధరామయ్య కుమార స్వామి Siddaramaiah Kumaraswamy Bs Yeddyurappa Karnataka Election Campaign

Loading comments ...

తెలుగు వార్తలు

news

8 యేళ్ళ బాలికపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారం

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ళ బాలికపై ఐదుగురు బాలురు సామూహికంగా అత్యాచారం ...

news

కిమ్ జోంగ్ ఉన్ స్నేహాస్తం : అణు పరీక్షలకు ఉత్తర కొరియా స్వస్తి

నిన్నమొన్నటివరకు బద్ధశత్రువులుగా మెలిగిన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య స్నేహం ...

news

నా సోదరుడు స్టాలిన్‌ను కలిసేందుకు చెన్నై వచ్చా : సీఎం కేసీఆర్

తన సోదరుడు ఎంకే స్టాలిన్‌ను కలిసేందుకు చెన్నపట్టణం వచ్చినట్టు సీఎం కేసీఆర్ తన చెన్నై ...

news

చంద్రబాబుది నాలుక కాదు.. తాటిమట్ట : సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఏపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ...

Widgets Magazine