Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అభిశంసన తీర్మానం తిరస్కృతి : 'సుప్రీం'ను ఆశ్రయిస్తామన్న కపిల్ సిబల్

సోమవారం, 23 ఏప్రియల్ 2018 (16:11 IST)

Widgets Magazine

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను తొలిగించాలంటూ విపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని సోమవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరస్కరించారు. దీన్ని ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ఈ అంశంపై మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులతో ప్రజాస్వామ్య అనుకూల శక్తులు పోరాడుతున్నాయన్నారు.
kapil sibal
 
చీఫ్ జస్టిస్ అభిశంసన పిటిషన్‌ను తిరస్కరించిన అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐకి చెందిన 64 మంది ఎంపీలు, ఇటీవల పదవీ విరమణ చేసిన ఆరుగురు రాజ్యసభ మాజీ సభ్యులు సంతకాలు చేసిన అభిశంసన నోటీసును శుక్రవారం వెంకయ్యనాయుడుకు అందజేసిన విషయం తెలిసిందే. 
 
మూడు రోజుల పాటు ఆయన దీనిపై విస్తృత సంప్రదింపులు నిర్వహించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, న్యాయకోవిదుడు కె.పరాశరన్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, న్యాయశాఖ మాజీ సెక్రటరీ పీకే మల్హోత్రా తదితరుల అభిప్రాయాలను వెంకయ్య తెలుసుకున్నారు. అలాగే, రాజ్యసభ సెక్రటేరియట్ సీనియర్ అధికారులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ సూచనలను కూడా తీసుకున్న తర్వాతే నోటీసును తిరస్కరించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఇక ఉరే... ఆర్డినెన్స్‌కు రాజముద్ర

దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాల అడ్డుకట్టకు కేంద్రం నడుం బిగించింది. ఇందులోభాగంగా, 12 ...

news

మీ వేషాలు.. నాదగ్గర కుదరవ్... పబ్లిక్‌గా తిట్టారు.. ప్రైవేట్‌గా సారీ చెప్తారా?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ట్వీట్ చేశారు. తనను, తన తల్లిని బహిరంగంగా ...

news

వైసీపీ తీరు ఎలా వుందంటే..? నారా లోకేష్ ఎద్దేవా

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేపడుతున్న నిరసనపై వైసీపీ ప్రతి ...

news

నెల్లూరు సోగ్గాడు ఆనం వివేకా ఆరోగ్యం విషమం

నెల్లూరు సోగ్గాడుగా గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం ...

Widgets Magazine