శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 9 మార్చి 2015 (17:58 IST)

బ్రెడ్‌ ఆనియన్‌ దహివడ ఎలా చేయాలి?

కావలసిన వస్తువులు:
‌బ్రెడ్‌ - ఆరు స్లైస్‌లు
ఉప్ప- తగినంత.
‌కారం - కొద్దిగా.
చాట్‌ మసాల- 1 టీ స్పూన్‌.
‌కొత్తిమీర - గార్నిష్‌కి.
‌ఉల్లిపాయ తరుగు - అర కప్పు 
‌అల్లం తురుము - ఒక కప్పు 
పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్ 
పెరుగు - ఒక కప్పు 
 
తయారీ విధానం : 
ముందుగా పెరుగులో అల్లం తరుగు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు వేసి మిక్సీలో ఒక రౌండ్‌ బ్లెండ్‌ చేయాలి. బ్రెడ్‌ చివరలు కట్‌ చేసి స్లైస్‌ని నీటిలో నీళ్లలో ముంచి, నీరంతా పిండేయాలి. ఆ తర్వాత గట్టిగా అదిమి మధ్యలో రంధ్రం చేయాలి. అప్పుడు చూడటానికి వడలా ఉంటుంది. ఒక ప్లేట్‌లో బ్రెడ్‌ వడలను తీసుకుని, వాటిమీద బ్లెండ్ చేసిన పెరుగు మిశ్రమాన్ని వేసి, పైన చాట్‌ మసాలా ఉల్లిపాయ ముక్కలు చల్లాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.