శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (17:10 IST)

ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ బనానా బెర్రీ సలాడ్!

నానా బెర్రీ సలాడ్ చిటికెలో తయారు చేయొచ్చు. అల్పాహారం తీసుకోవడానికి సమయం లేనప్పుడు.. సలాడ్స్ రూపంలో ఆ పోషకాలు శరీరానికి అందేలా చేసుకోవచ్చు. బనానా, బెర్రీస్‌లోని లో క్యాలరీలు ఒబిసిటీని దూరం చేస్తాయి. హృద్రోగ వ్యాధులను బెర్రీస్, బనానాస్ దూరం చేస్తాయి. ఎనర్జీని అందిస్తాయి. మెదడును చురుగ్గా ఉంచుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.  
 
బనానా బెర్రీ సలాడ్ ఎలా చేయాలి?
 
కావలసిన పదార్థాలు :
అరటి పండ్ల ముక్కలు :  రెండు కప్పులు 
చల్లిటి పెరుగు: ఒక కప్పు
మిల్క్ క్రీమ్ : రెండు టేబుల్ స్పూన్లు 
తేనె: ఒక టేబుల్ స్పూన్
బెర్రీ ఫ్రూట్స్ : పావు కప్పు 
స్ట్రాబెర్రీస్: పావు కప్పు  
 
తయారీ విధానం : 
ఓ మిక్సింగ్ బౌల్‌లో కట్ చేసిన బనానా ముక్కలు.. బెర్రీస్, పెరుగు వేసుకోవాలి. పెరుగు తాజాగా ఉండేట్లు చూసుకోవాలి. తర్వాత మిల్క్ క్రీమ్ సలాడ్స్‌పై వేయాలి. తేనెను కూడా కలుపుకోవాలి. ఒకవేళ లోఫ్యాట్ బ్రేక్ ఫాస్ట్‌గా దీనిని తీసుకునేటట్లైతే మిల్క్ క్రీమ్ వాడకపోవడం మంచిదే. లేదా లో ఫ్యాట్ మిల్క్ క్రీమ్‌ను వాడితే సరిపోతుంది. అంతే బనానా బెర్రీ సలాడ్ రెడీ. దీనిని పిల్లలకు, పెద్దలకు బ్రేక్ ఫాస్ట్‌గా అందించవచ్చు.