శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : శనివారం, 8 సెప్టెంబరు 2018 (13:26 IST)

గసగసాలతో పులావ్ ఎలా చేయాలో తెలుసా...?

గసగసాలు నిద్రలేమి వంటి సమస్యలను తొలగించుటకు ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మధమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇటువంటి గసగసాలతో పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

గసగసాలు నిద్రలేమి వంటి సమస్యలను తొలగించుటకు ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మధమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇటువంటి గసగసాలతో పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు: 
గసగసాల పేస్ట్ - అర కప్పు 
కొబ్బరి పాలు - 3 కప్పులు 
బియ్యం - 1 కప్పు 
క్యారెట్‌ ముక్కలు - అర కప్పు 
ఉల్లిపాయ - 1 
పచ్చిమిర్చి - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ 
టమాటా ముక్కలు - 1 కప్పు 
నెయ్యి - 25 గ్రాములు
కొత్తిమీర తరుగు - కొద్దిగా 
లవంగాలు - 4 
యాలకులు - 2 
దాసించెక్క - చిన్నది
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం:
ముందుగా నేతిలో మసాలాదినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించుకున్న తరువాత క్యారెట్‌ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి బాగా వేగించాలి. తరువాత ఆ మిశ్రమంలో కొబ్బరిపాలు పోసి అవి మరిగాక నానబెట్టిన బియ్యం, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే గసగసాల పులావ్ రెడీ.