బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (11:09 IST)

పాలక్ కబాబ్..?

కావలసిన పదార్థాలు:
పాలకూర - 2 కట్టలు
బంగాళాదుంపలు - 2
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 3
అల్లం - కొద్దిగా
కొత్తిమీర - 1 కట్ట
బ్రెడ్ స్లైసెస్ - 2
గరం మసాలా - కొద్దిగా 
నిమ్మరసం - 2 స్పూన్స్
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా బంగాళాదుంపల్ని ఉడికించి ఆపై వాటి పొట్టు తీసి మెత్తగా మెదుపుకోవాలి. ఈ మిశ్రమంలో పాలకూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, బ్రెడ్ స్లైసెస్, గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడల్లా వత్తుకుని ఓ 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇప్పుడు పెనం వేడిచేసి అందులో కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కబాబ్స్‌ను రెండు వైపులా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే నోరూరించే పాలక్ కబాబ్ రెడీ.