శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By PNR
Last Updated : మంగళవారం, 9 సెప్టెంబరు 2014 (12:51 IST)

పుల్ల మామిడితో "రవ్వ పులిహోర" తయారీ ఎలా?

కావలసిన పదార్థాలు :
పుల్లటి మామిడికాయ తురుము.. రెండు కప్పులు
బియ్యం రవ్వ.. నాలుగు కప్పులు
ఆవాలు.. రెండు టి స్పూన్లు
శెనగపప్పు, మినప్పప్పు.. రెండు టి స్పూన్లు చొప్పున
వేరుశెనగ పప్పు.. నాలుగు టి స్పూన్లు
జీడిపప్పులు.. 20
పచ్చిమిర్చి.. ఎనిమిది
ఎండుమిర్చి.. నాలుగు
ఇంగువ, పసుపు.. అర టి స్పూన్లు 
కరివేపాకు.. నాలుగు రెబ్బలు
నూనె, ఉప్పు.. సరిపడా
 
తయారీ విధానం :
ఎనిమిది కప్పుల నీటిలో బియ్యం రవ్వ, నాలుగు టీసూప్న నూనె, తగినంత ఉప్పు వేసి ఉడికించి పక్కనుంచాలి. ఆపై దాన్ని ప్లేట్లోకి తీసుకుని పొడి పొడిగా చేసి ఆరబెట్టాలి. ఇప్పుడు బాణలిలో తగినంత నూనె పోసి వేడయ్యాక ఇంగువ, ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, వేరుశెనగ పప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, నిలువుగా చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, జీడిపప్పులను కలపాలి.
 
ఐదు నిమిషాలయ్యాక మామిడి తురుమును కూడా చేర్చి రెండు నిమిషాలపాటు వేయించి స్టౌను ఆర్పేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడికించి పక్కనుంచిన బియ్యం రవ్వను చేర్చి బాగా కలియబెట్టాలి. అంతే కమ్మగా, పుల్లపుల్లగా అలరించే మామిడికాయ రవ్వ పులిహోర తయార్..!! దీన్ని అలాగే వేడి వేడిగా తింటే అద్భుతంగా, వెరైటీగా ఉంటుంది.