శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (12:19 IST)

అజీర్తికి చెక్ పెట్టే మెంతికూర చికెన్ ఎలా చేయాలో తెలుసా?

మెంతికూర, మెంతులు అజీర్తికి చెక్ పెడుతాయి. కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి వాటికి చెక్ పెట్టాలంటే.. మెంతికూరను ఆహారంగా తీసుకోవాలి. మెంతికూర పప్పు, మెంతికూర వంటి రొటీన్ వంటకాలతో బోర్ కొట్టేస్తే.. మెంతిక

మెంతికూర, మెంతులు అజీర్తికి చెక్ పెడుతాయి. కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి వాటికి చెక్ పెట్టాలంటే.. మెంతికూరను ఆహారంగా తీసుకోవాలి. మెంతికూర పప్పు, మెంతికూర వంటి రొటీన్ వంటకాలతో బోర్ కొట్టేస్తే.. మెంతికూరతో చికెన్ ట్రై చేసి చూడండి. ఎలా చేయాలంటే..?
 
కావలసిన పదార్థాలు 
చికెన్ : ఒక కేజీ 
మెంతికూర : రెండున్నర కప్పు 
పెరుగు : అర కప్పు 
ఉల్లి తరుగు : అర కప్పు 
పచ్చిమిర్చి : రెండు స్పూన్లు 
కారం : రెండున్నర స్పూన్ 
పసుపు : ఒక టీ స్పూన్
మిరియాలు : రెండు టీ స్పూన్లు 
మెంతులు : అర టీస్పూన్
జీలకర్ర : రెండు టీ స్పూన్లు 
గరం మసాలా : అర టీ స్పూన్ 
టమోటా తరుగు - మూడు కప్పులు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు టీ స్పూన్లు 
నూనె, ఉపు : తగినంత
 
తయారీ విధానం : 
ముందుగా మెంతులు, ఉల్లి, వెల్లుల్లి, అల్లం, లవంగా మిక్సీలో పేస్టులా రుబ్బుకుని పక్కన బెట్టుకోవాలి. ఈ పేస్టును పెరుగుతో కలిపి చికెన్ ముక్కలకు పట్టించి అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మందపాటి బాణలి నూనెను వేడి చేసి వేడయ్యాక జీలకర్ర, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. కాస్త వేగాక పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి, పసుపు వేసి వేపాలి. ఆపై చికెన్ ముక్కలు, మెంతి ఆకులు వేసి వేయించి.. కొద్దిసేపయ్యాక నీళ్లు పోసి ఉడికించాలి. ఇందులోనే టమోటా ముక్కలు, ఉప్పు, కారం గరం మసాలా వేసి నూనె తేలేంతవరకు ఉడికించి దించేస్తే.. మెంతికూర చికెన్ రెడీ అయినట్టే.