ఉప్పునీటితో నోటిని పుక్కిలించితే ఏం జరుగుతుందో తెలుసా?

నోటి పూత అనేది సహజంగా అందరికి వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కారంగా ఉన్న పదార్థాలను తీసుకోవడం వలన నోట్లో పుండ్లు ఏర్పడుతుంటాయి. ఈ నోటి పూతలు తొలగిపోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను

Kowsalya| Last Updated: శుక్రవారం, 10 ఆగస్టు 2018 (14:42 IST)
నోటి పూత అనేది సహజంగా అందరికి వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కారంగా ఉన్న పదార్థాలను తీసుకోవడం వలన నోట్లో పుండ్లు ఏర్పడుతుంటాయి. ఈ నోటి పూతలు తొలగిపోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.

కొద్దిగా తేనెను తీసుకుని నోట్లో పుండ్లు ఉన్న స్థలాల్లో రాసుకోవాలి. అరగంట పాటు ఏ ఆహారం గానీ, ద్రవాలు గానీ తీసుకోకూడదు. ఇలా రోజుకు 3 సార్లు చేయడం వలన నోటి పూత సమస్యలు తొలగిపోయి చక్కని ఉపశమనం కలుగుతుంది. కొబ్బరినూనెలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలున్నాయి. ఇవి నోట్లో ఏర్పడే పుండ్లను తగ్గిస్తాయి. 
 
కొద్దిగా కొబ్బరినూనెను తీసుకుని నోటి పుండ్లపై రాసుకోవాలి. ఇలా చేయడం వలన నోటి పూత నుండి విముక్తి లభిస్తుంది. గ్లాసుడు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పును కలుపుకుని ఆ నీటితో నోటిని పుక్కిలించాలి. ఇలా తరచుగా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును.

రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పేస్ట్‌లా చేసుకుని నోటి పుండ్లకు రాసుకోవాలి. ఇలా రోజుకు మూడునాలుగు సార్లు చేయడం వలన ఇటువంటి సమస్యల నుండి విముక్తి కావచ్చును. దీనిపై మరింత చదవండి :