మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 16 మే 2018 (14:25 IST)

గోదావరిలో ఘోరం.. 45మంది గల్లంతు.. కిటికీలు మూతపెట్టడంతో మునిగిపోయిందా?

గోదావరిలో ఘోరం జరిగిపోయింది. గాలివాన దెబ్బకు లాంచీ నీట మునిగింది. దీంతో 30 అడుగుల లోతుకు మునిగిపోయింది. గాలివాన దెబ్బకు నీటి అలజడి, గాలి తాకిడికి లాంచీ అదుపు తప్పడంతో నీట మునిగింది. లాంచ్‌ను ప్రారంభిం

గోదావరిలో ఘోరం జరిగిపోయింది. గాలివాన దెబ్బకు లాంచీ నీట మునిగింది. దీంతో 30 అడుగుల లోతుకు మునిగిపోయింది. గాలివాన దెబ్బకు నీటి అలజడి, గాలి తాకిడికి లాంచీ అదుపు తప్పడంతో నీట మునిగింది. లాంచ్‌ను ప్రారంభించవద్దన్నా వినకుండా సరంగు బయల్దేరడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 
 
వర్షం ధాటికి లాంచీ తలుపులు, కిటికీలు మూతపడటంతో.. లాంచీలోనే మిగిలిన వారంతా వుండిపోయారు. గల్లంతైన వారిపై భిన్న కథనాలు వస్తున్నాయి. ఇక అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలవరం నుంచి రెండు భారీ క్రేన్లను తరలించారు. ఫ్లడ్‌ లైట్లు, పడవలతో గాలింపు చర్యలు జరుగుతున్నాయి.  
 
గల్లంతైన వారంతా కష్టజీవులు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలానికి చెందిన గ్రామాలకు చెందిన వారు. కిరాణా సరుకులు, ఇతర అవసరాల కోసం మంగళవారం మండల కేంద్రమైన దేవీపట్నం వెళ్లారు. పనులన్నీ పూర్తయ్యాక తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. లక్ష్మీ వేంకటేశ్వర లాంచీ... దేవీపట్నం నుంచి కొండమొదలుకు నాలుగు గంటల సమయంలో పయనమైంది. అది 40 మంది సామర్థ్యమున్న లాంచీ. కానీ 60మంది లాంచీ కదిలింది. పెనుగాలులు వీస్తున్నాయని చెప్తున్నా సరంగు పట్టించుకోలేదు. 
 
ఈడ్చికొడుతున్న గాలిదెబ్బకు వాన చినుకులు లాంచీ కిటికీల్లోంచి లోపల పడుతున్నాయి. దీంతో కిటికీలు, తలుపులు మూసేశారు. కిటికీలన్నీ మూసేయడంతో పెనుగాలి ఒక్కసారిగా తోయడం, లోపలున్న వాళ్లంతా ఆందోళనతో ఒకేవైపునకు రావడం వల్ల లాంచీ పక్కకు ఒరిగిపోయింది. నిమిషాల్లోనే గోదావరిలో మునిగిపోయింది. గోదావరి తీరంలో మంటూరు-వాడపల్లి వద్ద ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
 
కాగా, పశ్చిమగోదావరి జిల్లాలోని గోదావరి నదిలో మునిగిపోయిన లాంచీని సహయకబృందాలు బుధవారం మధ్యాహ్నం వెలికి తీశారు. లాంచీలోనే చిక్కుకుపోయిన మృతదేహలను వెలికితీస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. బాధితులను ఓదార్చారు.