Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏపీలో బీజేపీ గెలుపు తథ్యం : హీరో కృష్ణంరాజు జోస్యం

బుధవారం, 16 మే 2018 (15:05 IST)

Widgets Magazine

సినీ నటుడు, బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన కృష్ణంరాజు జోస్యం చెప్పారు. వచ్చేయేడాది ఏపీ అసెంబ్లీకి జరిగే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. ఇక దక్షిణ భారతావనిలో కూడా కాషాయం జెండా రెపరెపలాడుతుందన్నారు.
krishnam raju
 
ఆయన బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, కర్ణాటకలో ప్రజలు ఇచ్చిన తీర్పుతో తమ పార్టీ ఉత్తర భారతదేశ పార్టీ అనే అపోహ తొలగిపోయిందన్నారు. కర్ణాటకలోని తెలుగు ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారని అన్నారు.
 
అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, కేసీఆర్, చంద్రబాబులు పిలుపునిచ్చినప్పటికీ తెలుగు ప్రజలు బీజేపీకే ఓటు వేశారని అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీ ఆంధ్రప్రదేశ్ Bjp Andhra Pradesh కృష్ణంరాజు Krishnam Raju Karnataka Election Results

Loading comments ...

తెలుగు వార్తలు

news

రైతుల కోసం దేశంలోనే మొదటిది అంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్

"సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నది. తెలంగాణ రాష్ట్రం ...

news

గోదావరిలో ఘోరం.. 45మంది గల్లంతు.. కిటికీలు మూతపెట్టడంతో మునిగిపోయిందా?

గోదావరిలో ఘోరం జరిగిపోయింది. గాలివాన దెబ్బకు లాంచీ నీట మునిగింది. దీంతో 30 అడుగుల లోతుకు ...

news

మా ఎమ్మెల్యే ఒక్కొక్కరికి భాజపా రూ.100 కోట్ల ఆఫర్... కుమారస్వామి ఆరోపణ

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఇచ్చేందుకు భాజపా ఆఫర్ చేసిందని ...

news

షాక్... 12 మంది కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్... కనబడటంలేదట...

కర్నాటకలో ఎమ్మెల్యేలను అంటిపెట్టుకుని వుండాల్సిన పరిస్థితి జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలకు ...

Widgets Magazine