శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 16 జనవరి 2018 (20:04 IST)

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటా... నటుడు సూర్య

హీరోహీరోయిన్లు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడికి మద్దతు తెలుపుతారో అస్సలు అర్థం కాదు. కొంతమంది అయితే ఏకంగా రాజకీయాల్లోకే వచ్చేస్తుంటారు. తమిళ, తెలుగు చిత్రసీమలో అలాంటివారు చాలామందే ఉన్నారు. అయితే తాజాగా ప్రముఖ తమిళ నటుడు సూర్య ఎపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రె

హీరోహీరోయిన్లు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడికి మద్దతు తెలుపుతారో అస్సలు అర్థం కాదు. కొంతమంది అయితే ఏకంగా రాజకీయాల్లోకే వచ్చేస్తుంటారు. తమిళ, తెలుగు చిత్రసీమలో అలాంటివారు చాలామందే ఉన్నారు. అయితే తాజాగా ప్రముఖ తమిళ నటుడు సూర్య ఎపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సక్సెస్ కావాలని ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్‌ను పంపాడు.
 
జగనన్న చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర విజయం కావాలని కోరుకుంటున్నా. జగనన్న ఎప్పుడూ ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపనలో ఉంటాడు. నిరంతరం అదే ఆలోచన. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలో, నేను చదువుకుంటున్న సమయంలో జగనన్న ఇంటికి చాలాసార్లు వెళ్లాను. నాకు ఆ వైఎస్ఆర్ కుటుంబంపై దగ్గరి సంబంధాలే ఉన్నాయి. కష్టపడే తత్వం జగనన్నలో ఉంది. అందుకే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లోనే జగన్ అంటే నాకు ఇష్టం. ఆయన చేస్తున్న పాదయాత్రలో నేను పాల్గొంటాను. త్వరలో పాదయాత్రకు వెళ్ళి జగన్‌ను కలిసి వస్తానని చెప్పారు సూర్య.