Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇష్టం లేని పెళ్లి చేశారనీ.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన నవవధువు

మంగళవారం, 8 మే 2018 (09:41 IST)

Widgets Magazine

తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారన్న కోపంతో అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తను తన ప్రియుడితో కలిసి ఓ నవ వధువు చేసింది. అదీ వివాహమైన కేవలం పది రోజులకే ఈఘాతుకానికి పాల్పడింది. ఆపై దోపిడీ దొంగలు చేసిన పనిగా చిత్రీకరించి.. ఆ తర్వాత లాజిక్ మిస్సై అడ్డంగా బుక్కయ్యింది. ఈ దారుణం విజయనగరం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
saraswathi
 
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కెల్ల గ్రామానికి చెందిన గౌరీశంకరరావు(30), సరస్వతికి ఈ నెల 28వ తేదీన వివాహం జరిగింది. అయితే గౌరీశంకరరావుతో పెళ్లి ఇష్టంలేని సరస్వతి ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో తన మాజీ ప్రియుడితో పాటు మరికొందరు స్నేహితులకు సుపారీ ఇచ్చి హత్యకు పథకం పన్నింది. 
 
ఈ పథకం ప్రకారం గరుగుబిల్లి మండలం తోటపల్లిలో కొత్త జంట బైక్ మీద వస్తుండగా దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో భర్త గౌరీశంకరరావు మృతి చెందాడు. అయితే.. భార్య సరస్వతికి గాయాలయ్యాయి. దాడి చేసిన అనంతరం దోపిడిదొంగలు నగలు అపహరించుకుపోయారు. దుండగులు భార్య మెడలో బంగారం లాక్కొని వెళ్తుండగా భర్త అడ్డుకున్నాడు. దీంతో ప్రతిఘటించిన భర్తపై వారు దాడి చేసి చంపారు. అనంతరం పరారయ్యారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో పాటు... సరస్వతి కదలికలను ఓ కంట కనిపెట్టారు. ఈ క్రమంలో కట్టుకున్న భర్తను హత్య చేసి నగలు అపహరించిన వారితో సరస్వతి ఫోను చేసి.. నా నగలు నాకు తెచ్చివ్వాలని డిమాండ్ చేయడంతో హంతకులు హ్యాండిచ్చారు. అప్పటికే పోలీసులు ఓ కంటకనిపెట్టివుండటంతో సరస్వతి నిజస్వరూపం బహిర్గతమైంది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఓటుకు నోటు కేసు: ఆ గొంతు చంద్రబాబుదే.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌.. కేసీఆర్ ఏమన్నారంటే?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో టేపులో ...

news

మోదుకూరులో దారుణం.. ఏడేళ్ల బాలికను రేప్ చేసిన 23యేళ్ల కామాంధుడు

గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన గురించి ఇంకా ఏ ఒక్కరూ ...

news

మోడీని దేశ ప్రధానిగా చేసి పశ్చాత్తాప పడుతున్నా : రాంజెఠ్మలానీ

ప్రధాని నరేంద్ర మోడీపై రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సీనియర్ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ ...

news

ఆడబిడ్డల జోలికొస్తే సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరుస్తాం : చంద్రబాబు హెచ్చరిక

ఆడబిడ్డల జోలికి వస్తే సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ...

Widgets Magazine