మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (10:26 IST)

సాయం కోసం వచ్చిన మహిళను ఎస్ఐ ఏం చేశాడంటే...

తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను ఎస్ఐ ట్రాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, చివరకు ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఆమె భర్తకే వార్నింగ్ ఇచ్చాడు.

తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను ఎస్ఐ ట్రాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, చివరకు ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఆమె భర్తకే వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విషయం సీరియస్ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉండే ఓ వివాహిత... తన భర్తపై కేసు పెట్టేందుకు స్టేషన్‌కు వచ్చింది. అయితే... ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎస్సై నర్సింహ ఆ మహిళతో మాటామంతీ కలిసి చివరకు ఆమెను ట్రాప్ చేశాడు. అనంతరం వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగసాగారు. 
 
ఆ తర్వాత ఆ మహిళను తన వశం చేసుకునేందుకు ఆ మహిళ భర్తకు ఎస్సై ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో ఖంగుతిన్న భర్త సతీష్ ఈ విషయాన్ని మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకెళ్ళాడు. ఎస్సై నర్సింహ తనను బెదిరిస్తున్నాడని, ఆయన బారి నుంచి కాపాడాలని మొరపెట్టుకున్నాడు. దీంతో డీసీపీ ఈ వ్యవహారంపై ఆరా తీసి అసలు విషయం తెలుసుకుని గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఆ ఎస్సైపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.