Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మంత్రి అనుచరుడి కబ్జా బాగోతం... 10 కోట్ల స్థలంపై కన్ను... ఎక్కడ?

బుధవారం, 27 డిశెంబరు 2017 (20:47 IST)

Widgets Magazine
lands

అధికార పార్టీ అంటే అంతేమరి. ప్రతి చోటా నాయకుడు కూడా తన మాటే చెల్లుబాటు కావాలనుకుంటాడు. పైగా దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనుకుంటారు. ఈ ప్రయత్నంలో అక్రమాలకు తెరలేపడం పరిపాటే. ఇక మంత్రిస్థాయి వ్యక్తి అనుచరులు అంటే తిరుగేముంది. తిరుపతిలో కబ్జాల పర్వానికి తెరలేపారు మంత్రి అనుచరుడు. ఒకటి రెండు కాదు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.  
 
తిరుపతి నారాయణపురంలోని పద్మావతి కళ్యాణి మండపాల వెనుకాల పుణ్యవతితో పాటు ఆమె చెల్లెల్లె పేరు మీద 5ఎకరాల స్థలం ఉంది. 1964వ సంవత్సరంలో పుణ్యవతి తండ్రి  స్థలాన్ని వెంకటరెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో ఒక షెడ్‌ను నిర్మించి ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు పుణ్యవతి. అయితే ఆ స్థలంపై మంత్రి అనుచరుడి కన్ను పడింది. ఒకటి రెండూ కాదు ఏకంగా 10 కోట్ల రూపాయలకు పైగా స్థలం ధర ఉండడంతో ఎలాగైనా స్థలాన్ని కబ్జా చేయాలని ఆలోచించాడు.
 
గత వారంరోజుల క్రితం నకిలీ సర్టిఫికెట్లను సృష్టించాడు. రెవిన్యూ అధికారుల అండతోనే నకిలీ పత్రాలను సృష్టించినట్లు బాధితురాలు ఆరోపిస్తుంది. రాత్రి వేళల్లో అతడి అనుచరులు తామున్న షెడ్ల వద్దకు వచ్చి స్థలాన్ని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని ఆరోపిస్తోంది బాధితురాలు పుణ్యవతి. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. మంత్రి అనుచరుడు కావడంతో పోలీసులు కూడా తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రియల్ టైమ్ గవర్నెన్స్‌లో ఏపీ భేష్... బాబుకు రాష్ట్రపతి ప్రశంస

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్స్ అనే వినూతన్న కార్యక్రమానికి ...

news

పాపను చూసేందుకు ఆదివారం ఇంటికొచ్చి ఇబ్బంది పెట్టేవాడు: వనితా రెడ్డి

హాస్య‌న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య కేసులో ఆయన సతీమణి వనితా రెడ్డి పోలీసుల ముందు లొంగిపోయింది. ...

news

షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగి అరెస్ట్: హారికను వేధించడంతో?

షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవ‌ల షార్ట్‌ఫిల్మ్‌ నటి ...

news

బ్లూవేల్ గేమ్‌ ఎఫెక్ట్: బాంబు బూచి.. పోలీసులకు చుక్కలు చూపించిన ఎంసీఎ విద్యార్థి

బ్లూవేల్ ఆన్‌లైన్‌ గేమ్ భూతం బారిన మ‌రో యువ‌కుడు ప‌డ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఎంసీఏ ...

Widgets Magazine