శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 2 డిశెంబరు 2017 (17:40 IST)

ఎవడో కొన్‌కిస్కా వస్తే వంగి వంగి 100 లడ్లు ఇస్తారు... జేఈవోపై రోజా ఫైర్(వీడియో)

గాలేరు-నగరి ప్రాజెక్టు సాధన కోసం 88 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన నగరి ఎమ్మెల్యే రోజా శనివారం నాడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ... తమ పట్ల తితిదే జేఈవో ప్రవర్తించిన తీరు అమానుషమన్నారు. ప్రజా సేవకులమైన తమకు ఎల్

గాలేరు-నగరి ప్రాజెక్టు సాధన కోసం 88 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన నగరి ఎమ్మెల్యే రోజా శనివారం నాడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ... తమ పట్ల తితిదే జేఈవో ప్రవర్తించిన తీరు అమానుషమన్నారు. ప్రజా సేవకులమైన తమకు ఎల్ 1, ఎల్ 2లో దర్శనం చేసుకునే అవకాశం ఇవ్వమంటే ఇవ్వలేదని మండిపడ్డారు. 
 
"అడ్డమైనవాళ్లకి ఎల్ 1 టిక్కెట్లిస్తున్నారు. తనతో వచ్చినవారికి పనులున్నాయి, వ్యాపారాలున్నాయి. తామంతా ప్రజల కోసం పోరాడుతున్నాం. తిరుమల దర్శనం విషయంలో జేఈవో ఉత్తరాది వారికి ప్రాముఖ్యత ఇస్తుంటారు. సూట్‌కేసులు అందుకుంటున్నారు. దేవుడి దగ్గర మాట్లాడకూడదనుకున్నాను. ఎవడో కొన్‌కిస్కా వస్తే వంగి వంగి 100 లడ్లు ఇచ్చి ఎన్నో మర్యాదలు చేసి పంపిస్తారు. కానీ పేదవారిని సెకను కూడా తిరుమల వెంకన్నను చూడనివ్వరు. 
 
ఏడేళ్లుగా అతడే జేఈవోగా ఎలా వున్నారు. ఈవోగా సాంబశివరావు వున్నంతకాలం తోక ముడుచుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఉత్తరాది వ్యక్తి ఈవోగా రావడంతో మొత్తం అధికారాన్ని ఇతని చేతిలో పెట్టుకున్నాడు. పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత వారిపై వుంది. తితిదే బోర్డును కూడా వేయనియ్యకుండా తిష్టవేసి కూర్చున్నాడు. ఆయన అసలు సంగతి ఏమిటో సమాచార చట్టం కింద మొత్తం బయటకు లాగుతా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు రోజా.