టిటిడి మొదటి బోర్డు మీటింగే వివాదాస్పదం.. ఎందుకు?(Video)

బుధవారం, 16 మే 2018 (18:54 IST)

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి. టిటిడిలో విధులు నిర్వహిస్తున్న 65 సంవత్సరాలు పైబడిన అర్చకులకు ఉద్యోగ విరమణ వర్తింపు నిర్ణయం తీసుకున్నారు. 
Sudhakar Yadav
 
ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయానికి సలహా మండలి ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పరిధిలో ఉన్న చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రతినెలా ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహణ, టిటిడి పలు బ్యాంకుల్లో చేస్తున్న డిపాజిట్లకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 
 
ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు... శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై వివరణ కోరుతామని చెప్పారు. జూన్‌ 5న టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరుగనుంది. తితిదే నిర్ణయాలను వీడియోలో చూడండి...దీనిపై మరింత చదవండి :  
Ttd Controversy Tirumala

Loading comments ...

తెలుగు వార్తలు

news

లాంచీ బాధిత కుటుంబాలను ఆదుకోండి... ప్రభుత్వ ఉద్యోగమివ్వండి...

అమరావతి : గోదావరి నదిలో లాంచీ బోల్తా ఘటనలో గల్లంతయిన వారి కుటుంబాలను అన్ని విధాలా ...

news

గోదావరి లాంచీ మునక: చంద్రబాబు ఏమన్నారు..? సిమెంట్ బస్తాలు తెచ్చారట..

గోదావరి లాంచీ మునక ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. గోదావరి లాంచీ మునక ...

news

చంద్రబాబుకు అది దోచేయడం బాగా తెలుసు: పవన్ కళ్యాణ్ విమర్శ

మానవతా దృష్టి ప్రభుత్వానికి లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు జనసేన పార్టీ అధినేత ...

news

బీజేపీకే కర్ణాటక గవర్నర్ ఫస్ట్ ఛాన్స్ ... 17న యడ్యూరప్ప ప్రమాణం స్వీకారం?

కమలనాథులు ఊహించినట్టుగానే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ...