Widgets Magazine

కిక్కిరిసిపోతున్న హైదరాబాద్ నగర జైళ్లు.. ఎందుకు?

మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (14:34 IST)

chanchalguda jail

హైదరాబాద్ మహానగరంలోని జైళ్లన్నీ నిండిపోతున్నాయి. ఈ జైళ్ళకు వస్తున్న వారంతా తీవ్రమైన నేరాలు చేసినవారు కాదు. కేవలం మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారే కావడం గమనార్హం. 
 
సాధారణంగా దొంగతనం, దోపిడీ, హత్యలు, అత్యాచారాలువంటి నేరాలు చేసిన వాళ్లు జైలుకెళుతుంటారు. కానీ, ఇపుడు హైదరాబాద్‌లో పరిస్థితి తారుమారైంది. మత్తు కోసం మందేసి, వాహనం నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడితే చాలు... జైలు శిక్ష అనుభవించక తప్పదన్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా హైదరాబాద్ నగరంలోని అన్ని జైళ్ళలో మందుబాబుల సందడి కనిపిస్తోంది. 
 
హైదరాబాద్, చంచల్‌గూడ జైలు అధికారుల గణాంకాల మేరకు 2017లో మొత్తం 9,650 మంది ఖైదీలు జైల్లో ఉండగా, వారిలో మందుబాబులు 6,511 మంది. ఇక ఈ సంవత్సరం జనవరిలో 1,758 మంది జైలుకు వెళ్లగా, అందులో 920 మంది మందుబాబులే కావడం గమనార్హం. అంటే, గత యేడాది జైలుకు వెళ్లిన వారిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మద్యం తాగి వాహనాలు నడిపిన వారు కాగా, ఈ సంవత్సరం ప్రతి ఇద్దరిలో ఒకరు అదే నేరం చేసి జైలుకు వెళుతున్న పరిస్థితి. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
మందుబాబులు జైలు పోలీసులు Jail Hyderabad Police Report హైదరాబాద్ Drunk Driving

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫలించిన భారత్ ఒత్తిడి.. హఫీజ్ సయీద్ ఉగ్రవాదే : పాకిస్థాన్

అంతర్జాతీయంగా భారత్ చేసిన ఒత్తిడి ఫలిచింది. ఫలితంగా ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ ...

news

బొటానికల్ గార్డెన్ మర్డర్ కేసు : వదినను హత్య చేసి రంపంతో ముక్కలు చేశాడు

గర్భిణిని ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి హైదరాబాద్ కొండపూర్‌లోని బొటానికల్ గార్డెన్ వద్ద ...

news

నడుముపై చేయి వేసి, అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధింపులు..

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు రాత్రిపూటే కాదు పట్టపగలు కూడా భద్రత లేదు. ఢిల్లీ ...

news

సుంజువాన్ ఆర్మీ క్యాంపు దాడికి ప్రతీకారం తప్పదు : నిర్మలా సీతారామన్

జమ్మూకాశ్మీర్‌లో సుంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారం తప్పదని ...

Widgets Magazine