Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవి నోరు లేనివారు... నేనైతేనా... పీఆర్పీపై పవన్ కళ్యాణ్ ఏమన్నారు?

గురువారం, 7 డిశెంబరు 2017 (14:54 IST)

Widgets Magazine
pawan

గత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాలేక పోవడానికి గల కారణాలను ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తాజాగా వెల్లడించారు. పార్టీ వ్యవస్థాపకుడు, తన అన్న చిరంజీవికి ప్రజాసేవ చేయాలన్న బలమైన ఆకాంక్ష, మంచి చేయాలనే తపన ఉందన్నారు. కానీ, ప్రజారాజ్యంలోని కొందరు స్వార్థపరులకు ఆ పార్టీ బలైపోయిందన్నారు. అలా జరగకుండా ఉండివుంటే పీఆర్పీ ఇపుడు అధికారంలో వుండేదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
రాజమండ్రిలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను స్ప‌ష్ట‌మైన‌ విధివిధానాలతోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని స్పష్టంచేశారు. నిస్వార్థ‌మైన వారు ప్ర‌జారాజ్యం పార్టీలో ఉండుంటే ప్ర‌జారాజ్యం ఇప్పుడు అధికారంలో ఉండేదన్నారు. 
 
రాజ‌కీయం అంటే సీఎం కావ‌డం కాదని, సామాజిక మార్పు చేయ‌డ‌మే రాజ‌కీయమ‌న్నారు. 'సీఎం అవుతాను.. అప్ప‌టివ‌ర‌కు ఆగండి ప‌నులు చేస్తానంటే కుద‌ర‌ద'ని అన్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ప్ర‌భుత్వంతో ఎన్నో ప‌నులు చేయించ‌వ‌చ్చని హిత‌వు ప‌లికారు.
 
అలాగే, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ వంటి కమిట్‌మెంట్‌లేని వ్య‌క్తులు జ‌న‌సేన‌లో ఉండ‌కూడ‌దన్నారు. పీఆర్పీలో గుర్తింపు ఇవ్వ‌లేద‌ని చిరంజీవిపై వారు క‌స్సున లేచార‌ని, మ‌రి వారు ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతున్నా ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని పవన్ విమర్శలు ఎక్కుపెట్టారు. 
 
విభజన చట్టంలోని హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదాపై ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్, ఆయన భార్య, కేంద్ర రక్షణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఎందుకు మాట్లాడ‌రు? అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు. హోదాపై తానొక్క‌డినే మాట్లాడాలా? అని నిల‌దీశారు. సైద్ధాంతిక బ‌లంతో తాను జ‌న‌సేన పార్టీ పెట్టాన‌ని, గ‌తంలో బాగా ఆలోచించే బీజేపీ, టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చానని పవన్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నాది, పవన్‌‍ది ఒకటే ఆలోచనే.. పోలవరం విషయంలో రాజీపడను: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ఏపీ సర్కారు తగిన చర్యలు తీసుకుంటుందని ఏపీ సీఎం ...

news

'పోలవరం'లో అవినీతి లేకపోతే భయమెందుకు? : బాబుకు పవన్ ప్రశ్న

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చోటుచేసుకోకుంటే నిధుల లెక్కలు కేంద్ర ప్రభుత్వానికి ...

news

'లవ్ జిహాద్' క్రూరత్వం : సుత్తితో కొట్టి చంపి.. తగలబెట్టాడు

'లవ్ జిహాద్' పేరుతో ఓ వ్యక్తి అత్యంతక్రూరంగా ప్రవర్తించాడు. ముఖ్యంగా, ఎలాంటి పాతకక్షలు ...

news

భార్య శవాన్ని భుజంపై మోసిన భర్త ఇపుడు లక్షాధికారి ఎలా?

అనారోగ్యంతో ఆస్పత్రిలో చనిపోయిన భార్యను ఆంబులెన్స్‌లో తరలించేందుకు డబ్బులు లేక 10 ...

Widgets Magazine