Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ ఇద్దరి రాజీనామా.. ఆ ముగ్గురి నవ్వులు.. చంద్రబాబు ప్రశంసల జల్లు

గురువారం, 8 మార్చి 2018 (12:00 IST)

Widgets Magazine

అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన భాజాపా నేతలు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నుంచి  వైదొలిగారు. సీఎం చంద్రబాబును కలిసిన ఇరువురు రాజీనామా లేఖలను ఆయనకు అందజేశారు. అంతకుముందు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో కూర్చుని ఉండగా తెదేపా మంత్రులు వారిని కలిశారు.
 
పదవుల నుంచి తప్పుకుంటున్నందుకు బాధగా వుందా అని తెదేపా మంత్రి ప్రశ్నించగా.. ప్రజల కోసం రాజీనామా చేసినట్లు చెప్పారు. పదవి నుంచి సంతోషంగా వైదొలుగుతున్నట్లు చెప్పారు. ఆ తరువాత మంత్రి మాణిక్యాలరావును కలిసిన గంటా మిమ్మల్ని అభినందించాలా? లేక సానుభూతి వ్యక్తంచేయాలా? అని అడిగారు. ఎప్పటిలాగానే అభినందించండంటూ మాణిక్యాలరావు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా గంటా, మాణిక్యాలరావు, కామినేనిల మధ్య నవ్వులు పూశాయి.
 
మరోవైపు వైద్యఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావులు తమ పదవులకు రాజీనామా చేసిన అనంతరం అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. బీజేపీ తరపున ఎంపికైన ఇద్దరు మంత్రులు సమర్థవంతంగా పనిచేశారని అభినందించారు. 
 
కృష్ణా, గోదావరి పుష్కరాలను మంత్రి మాణిక్యాలరావు సమర్థవంతంగా నిర్వహించారని, వైద్య ఆరోగ్యశాఖలో కామినేని శ్రీనివాస్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని కితాబిచ్చారు. ఓ ముఖ్యమంత్రిగా వారి సమర్థవతమైన సేవలను అభినందిస్తున్నానని బాబు వ్యాఖ్యానించడంతో.. అసెంబ్లీలో కేబినెట్ సహచరులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అరుణ్ జైట్లీ మాటలు బాధాకరం.. కాంగ్రెస్‌కు పట్టిన గతే: చంద్రబాబు

కాంగ్రెస్‌కు పట్టిన గతే కేంద్రంలోని బీజేపీకి పడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ...

news

పర్యాటకులకు శృంగార పాఠాలు.. హోటల్‌లో వింత శబ్ధాలు.. మోడల్ అరెస్ట్

పర్యాటకులుగా వచ్చిన పురుషులకు శృంగార పాఠాలు చెప్పిన మోడల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ...

news

కేంద్ర ప్రభుత్వంపై 21న అవిశ్వాసం.. బాబు సహకరించాలి: జగన్

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీలోని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. ఏపీకి ప్రత్యేక ...

news

ప్రజాగ్రహాన్ని చూసి చంద్రబాబు తలొగ్గారు.. సంతోషమే: జగన్

కేంద్రంతో కటీఫ్ నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని విపక్ష నేత వైఎస్సార్ ...

Widgets Magazine