Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నగరి సీటు ఓకే చేయండి, రోజా పని పడ్తా... బాలయ్యతో వాణీవిశ్వనాథ్

సోమవారం, 13 నవంబరు 2017 (14:11 IST)

Widgets Magazine
Vani Viswanath

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నటి వాణీ విశ్వనాథ్ చేరిక గురించి చర్చ జరుగుతోంది. అందులోను వాణీ విశ్వనాథ్ పార్టీలో చేరడానికి సమయం ఉండగానే ఆమె ఒక నియోజకవర్గం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ నియోజకవర్గమే చిత్తూరు జిల్లాలోని నగరి. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి వైసిపి తరపున ఎమ్మెల్యేగా రోజా ఉండగా, తెలుగుదేశం పార్టీ నుంచి టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుక్రిష్ణమనాయుడు గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే పోటీ చేస్తున్నారు. ముద్దుక్రిష్ణమనాయుడు ఈ నియోజకవర్గం తప్ప ఇంకెక్కడా పోటీ చేయలేరు.
 
కానీ వాణీ విశ్వనాథ్ మాత్రం ఆ నియోజకవర్గమే తనకు కావాలని పట్టుబడుతున్నారు. చినబాబు నారా లోకేష్‌‌తో సంప్రదింపులు జరిపిన తరువాత 29న ఆమె పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. అయితే తను పార్టీలో చేరినా ఒక ఫైర్‌బ్రాండ్‌గా ముందుకెళ్ళాలన్నదే వాణీ విశ్వనాథ్ ఆలోచన. ఆ ప్రయత్నమే వాణీ విశ్వనాథ్ చేస్తోంది. 
 
నగరిలో రోజాకు పోటీగా వచ్చి ఎన్నికల్లో నిలబడితే త్వరలోనే రాజకీయాల్లోకి ఫైర్‌బ్రాండ్‌గా మారిపోవచ్చన్నది ఆమె ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్లుగానే తనకున్న సినీ పరిచయాలతో ఆ నియోజకవర్గాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. 
 
నందమూరి బాలక్రిష్ణ హెల్పింగ్ హ్యాండ్ పేరుతో అనంతపురం జిల్లాలో జరిగిన కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు వాణీ విశ్వనాథ్. స్వయంగా బాలక్రిష్ణ కోరిక మేరకే ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలక్రిష్ణ తనకు సినీ పరిశ్రమలో బాగా పరిచయం. అందులోను హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీలో కీలక నేతగా ఉన్నారు కాబట్టి బాలక్రిష్ణ అనుకుంటే సీటు ఖాయమన్నది వాణీ విశ్వనాథ్ ఆలోచన. అదేపని ప్రస్తుతం చేస్తోంది వాణీ విశ్వనాథ్. 
 
ఇప్పటికే బాలక్రిష్ణ దృష్టికి నగరి నియోజకవర్గ సీటు గురించి చెప్పడంతో ఇంకా సమయముంది కదా మాట్లాడదామని బాలయ్య హామీ ఇచ్చారట. దీంతో వాణీ విశ్వనాథ్ నగరి సీటు తనకేనన్న ధీమాలో ఉన్నారు. ధీమా బాగానే వున్నది కానీ అక్కడ రోజాను ఓడించడం ఈజీయేనా?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఏపీ టూరిజం అధికారి మొత్తుకున్నా.. దండం పెట్టినా... బోటు తీశారు..

పవిత్ర సంగమం వద్ద బోటు తిరగబడింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనకు ...

news

చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం అదే... పోసాని కృష్ణమురళి

సినిమా ఇండస్ట్రీలో ఉన్నదివున్నట్లుగా చెప్పే నటుల్లో పోసాని కృష్ణమురళి కూడా ఒకరు. ఆయన ...

news

ఆస్పత్రిలోనే నిఖా జరిగింది... ఎందుకంటే?

ప్రేమ పవిత్రమైంది. సాంకేతికత పెరిగినా.. ప్రేమలోని ఆప్యాయత, అనురాగం ఏమాత్రం మారలేదు. ...

news

కొడుకుతో పెళ్లి... కుమార్తెతో లైంగిక సంబంధం.. ఓ కన్నతల్లి నిర్వాకం

అమెరికాలోని ఓక్లహోమాకు చెందిన ఓ కన్నతల్లి వావివరసలు పూర్తిగా విస్మరించింది. లింగభేదం మరచి ...

Widgets Magazine