Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పర్యాటకం మాటున అశ్లీలం... హైదరాబాద్‌ టు సూర్యలంక...

శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (10:11 IST)

Widgets Magazine
bar dance

పర్యాటకం మాటున అశ్లీలం నృత్యాలు పెరిగిపోయాయి. ఇవి హైదరాబాద్ నుంచి సూర్యలంక వరకు విస్తరించాయి. హైదరాబాద్‌లో ఫాంహౌస్‌, రిసార్ట్స్‌లలో రహస్యంగా నిర్వహించే ముజ్రా నృత్యాల సంస్కృతి ఇపుడు ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న సూర్యలంక వరకు చేరింది. 
 
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న బీచ్‌ సూర్యలంక. ఇక్కడికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటక శాఖ రిసార్ట్స్‌తో పాటు ప్రైవేటు రిసార్ట్స్‌ ఈ ప్రాంతంలో వెలిశాయి. శుక్ర, శని, ఆదివారాలు ఇవి కిటకిటలాడుతుంటాయి. ఎక్కువగా యువత వారాంతంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సరదాగా గడిపి వెళ్తుంటారు. 
 
హైదరాబాద్‌ పరిసరాల్లో ముజ్రా నృత్యాలు, రేవ్‌ పార్టీల సంస్కృతి పెరిగిపోయింది. యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. గోవా నుంచి ఈ సంస్కృతి విస్తరించింది. ఇది చిన్నగా సూర్యలంకకు చేరింది. ఇక్కడ అయితే పెద్దగా పోలీసుల నిఘా ఉండదని భావించి హైదరాబాద్‌ నుంచి వస్తున్న కొందరు పర్యాటకులు ముజ్రా నృత్యాల పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. 
 
ఇక్కడ బీచ్‌కు వెళ్లే రహదారిలో రామ్‌నగర్‌ సమీపంలో శివ రిసార్ట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 8 మంది యువతులు అశ్లీల నృత్యాలు చేస్తుండగా అర్థరాత్రి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ముజ్రా నృత్యాలతో పార్టీ చేసుకుంటున్న సంగారెడ్డికి చెందిన 22 మందిని అరెస్ట్‌ చేశారు. అయినప్పటికీ.. వారాంతాల్లో అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగానే సాగుతున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కుండపోత వర్షం.... తడిసి ముద్దవుతున్న భాగ్యనగరం..

హైదరాబాద్ మరోమారు తడిసి ముద్దవుతోంది. రాత్రి నుంచి పడుతున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు ...

news

మా శక్తితో పోలిస్తే మీరేపాటి?.. సద్దాం, గడాఫీలకు పట్టిన గతేపడుతుంది..

ఉత్తర కొరియాకు అగ్రరాజ్యం అమెరికాకు చెందిన మీడియా గట్టిహెచ్చరిక చేసింది. వరుసగా క్షిపణి ...

news

ఇరాక్ రెస్టారెంట్ ఐఎస్ఐఎస్ నరమేధం... 74 మంది హతం

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరో నరమేథానికి ...

news

కూచిభొట్ల భార్యకు అమెరికా వీసా మంజూరు

అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల సతీమణికి ...

Widgets Magazine