గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 ఏప్రియల్ 2018 (17:04 IST)

చంద్రబాబుకు - శేఖర్ రెడ్డికి లింకులు.. ఆధారాలున్నాయ్ : బొత్స సత్తిబాబు

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇసుక కాంట్రాక్టర్ జే శేఖర్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మధ్య సంబంధాలు ఉన్నాయని వైకాపా నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మా

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇసుక కాంట్రాక్టర్ జే శేఖర్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మధ్య సంబంధాలు ఉన్నాయని వైకాపా నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఇదే అంశంపై ఆయన బుధవారం మాట్లాడుతూ, నోట్ల రద్దు సమయంలో చంద్రబాబు - శేఖర్‌ రెడ్డిల మధ్య చాలా లావాదేవీలు జరిగాయని ఆయన ఆరోపించారు.
 
ముఖ్యంగా, పెద్ద నోట్ల రద్దు సందర్భంగా చంద్రబాబు తన ద్వారా 500 కోట్ల రూపాయల బ్లాక్ మనీని మార్చుకున్నారని సీబీఐకు జే.శేఖర్ రెడ్డికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారని తెలిపారు. ఈ సీబీఐ నివేదిక బయట పడితే చంద్రబాబుతో శేఖర్ రెడ్డికి ఉన్న లింకేంటనేది బయటపడిపోతుందని బొత్స చెప్పారు. 
 
అలాగే, శేఖర్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేష్‌కు మధ్య సంబంధాలు ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారనీ బొత్స గుర్తు చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారని... పిమ్మట తాను అదే విషయంపై ఆరా తీస్తే చాలా వాస్తవాలు బయటపడ్డాయని బొత్స సత్యనారాయణ వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో శేఖర్ రెడ్డికి ఉన్న చీకటి సంబంధం వ్యవహారాన్ని జనంలోకి తీసుకెళ్తామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు.