Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆముదం తలకు రాస్తూ వుంటే రేచీకటి మటాష్ (Video)

సోమవారం, 13 నవంబరు 2017 (17:58 IST)

Widgets Magazine

ఆముదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆముదం నూనెను కొంచెం తీసుకుని చ‌ర్మంపై మ‌ర్ద‌న చేసినట్లైతే..  చర్మం మృదువుగా తయారవుతుంది. మ‌చ్చ‌లు పోతాయి. ఆముదము, కొబ్బరి నూనె సమానంగా కలిపి అరికాళ్ళకు బాగా మర్దనా చేస్తూంటే, అతిత్వరగా అరికాళ్ల‌ మంటలు మాయ‌మ‌వుతాయి. పాదాల పగుళ్లు తొలగిపోతాయి. మంచి వంటాముదాన్ని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తలకు పెడుతూ ఉంటే, రెండు మూడు నెలల్లో రేచీకటి తగ్గిపోతుంది.
 
ఆముదపు చెట్టు పూవులను పాలతో నూరి కణతలకు పట్టువేసి, తల పైన కూడా వేసి కట్టుకడితే అతి మగతగా ఉండి ఎక్కువగా నిద్ర వచ్చే సమస్య నివారణ అవుతుంది. ఆముదం నూనెను త‌ర‌చూ జుట్టుకు ప‌ట్టించి త‌ల‌స్నానం చేస్తుంటే చుండ్రు త‌గ్గిపోతుంది. వెంట్రుక‌లు దృఢంగా మారుతాయి. జుట్టు ప్రకాశవంతంగా క‌నిపిస్తుంది. ఆముదం చర్మం అడుగున ఉండే కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. 
 
దీంతో చర్మం మీద అప్లై చేస్తే బిగుతుగా తయారై ముడతలు తగ్గుతాయి. ఆముదంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. కాబట్టి చర్మంపై అప్లై చేస్తే ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెంది మచ్చలు మటుమాయం అవుతాయి. 4 టీస్పూన్ల కొబ్బరినూనెలో 2 టీస్పూన్ల ఆముదం కలిపి పొట్ట మీద పట్టు వేసి రాత్రంతా ఉంచాలి. ఇలా చేస్తే పొట్టలోని నులిపురుగులను తొలగించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

షాకింగ్... ప్రతి 5 జంటల్లో ఓ జంట ఆ పని చేస్తోందట...

స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాక వాటి వాడకంలో పిచ్చి పీక్స్‌కు వెళ్లిపోతోంది. కొంతమంది తమ ...

news

మునగాకును వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చితే?

మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మధుమేహాన్ని దూరం ...

news

రోజూ స్పూన్ తేనెలో చిటికెడు కుంకుమ పువ్వు కలుపుకుని?

ఆరోగ్యం కోసం.. ఈ చిట్కాలు పాటించండి. గ్లాసు నీటిలో తులసి, వేపాకులు, మిరియాలు వేసి ...

news

ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరాన్నితాకితే...

చాలామంది ఉదయాన్నే నిద్రలేవడం ఎంతో కష్టంగా భావిస్తుంటారు. రాత్రిసమయంలో ఎంత ఆలస్యంగానైనా ...

Widgets Magazine