పువ్వులతో చర్మ సౌందర్యం.. మల్లెపూల ముద్దకు చెంచా పాలు చేర్చి?

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (09:05 IST)

మల్లె, గులాబీ పువ్వుల వాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. పువ్వులు ముఖ చర్మానికి అందాన్ని, చర్మానికి తాజాదనాన్ని తెస్తాయి. సూర్యకిరణాలతో నల్లగా మారే చర్మానికి తిరిగి మెరుపును తేగలిగే ఔషధగుణాలు పువ్వుల్లో పుష్కలంగా వున్నాయి. ముఖ్యంగా మల్లెల్లో పొడిబారిన చర్మాన్ని మార్చగలిగే శక్తి ఉంది. చెంచా మల్లెపూల ముద్దకు చెంచా పచ్చిపాలను కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తరవాత చన్నీళ్లతో కడిగేయాలి. తద్వారా చర్మం మెరుపులీనుతుంది.
 
అలాగే గులాబీ రేకులు గుప్పెడు తీసుకుని రెండు చెంచాల నీటిని కలిపి ముద్దలా నూరాలి. దీనికి చెంచా చొప్పున పాలూ, గ్లిజరిన్‌ కలిపి ముఖం, మెడకూ రాసుకోవాలి. ఇది పూర్తిగా ఆరాక చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే.. చర్మం మెరిసిపోతుంది. 
 
అలాగే కేశ, చర్మ సౌందర్యానికి మందారం ఎంతగానో తోడ్పడుతుంది. మందారం చర్మ కాంతిని పెంచుతుంది. ఇవి చర్మంపై ముడతలు లేకుండా నివారిస్తాయి. రెండు మందార పూల రేకులకు ఎనిమిది గులాబీ రేకులను కలిపి ముద్దలా చేసుకుని.. చెంచా పెరుగు, ముల్తానీ మట్టిని కూడా అందులో కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేసుకోవాలి. తద్వారా చర్మంపై వున్న మచ్చలు తొలగిపోతాయి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఈ గర్భనిరోధక మాత్ర వేసుకుంటే ఆ వ్యాధి రాదా..?

గర్భనిరోధక మాత్రలు గర్భం రాకుండా అడ్డుకునేవి అయినప్పటికీ ఆ మాత్రలతో సైడ్ ఎఫెక్ట్స్ ...

news

అబద్దం ఆడితే ఆకులు రాల్తాయ్... అది సినిమాలో... వాస్తవంలో అయితే...

తమకు తెలిసిన వారిని గుర్తించి కూడా అబద్దం చెబుతున్న వారిని వారి కంటి కదలికలే ...

news

కారు నడుపుతూ నిద్రపోతే ఆ బెల్టు అరుస్తుంది...

వాహనం నడిపేవారు నిద్రమత్తులో జారుకుంటే ఎన్నో ప్రమాదాలకు కారణమవుతుంది. ప్రతి సమస్యకు ...

news

పొట్టలో పేరుకుపోయిన కొవ్వుతో మహిళలకు ఆ ముప్పు తప్పదట?

మహిళల్లో బరువు ప్రమాదకరం.. అది క్యాన్సర్‌కు దారితీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ...