Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆరోగ్యానికి పాలు ఎంత అవసరమో... అందానికి కూడా అంతే...

సోమవారం, 8 జనవరి 2018 (16:13 IST)

Widgets Magazine
Raw-milk

పాలు తాగితే బలం వస్తుంది. ఆరోగ్యంగా ఉంటాం. మరి ఆరోగ్యానికి అందాన్ని జత చేయాలంటే కూడా పాలు కావాల్సిందే. చర్మం కాంతివంతంగా మెరవాలన్నా, మృదువుగా మారాలన్నా పాలను మించినది మరొకటి లేదు. ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఓట్ మీల్, పాలు తీసుకుని రెండింటినీ కలపాలి. ముఖాన్ని బాగా శుభ్రం చేసుకుని ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. చేతి వేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మృతకణాలు, అధికంగా ఉండే నూనెలు, దుమ్ముధూళి పోయి చర్మం శుభ్రపడుతుంది. 
 
పదిహేను నిమిషాలు ఆగి ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఓ కప్పు పచ్చిపాలు, పావు కప్పు తేనె, అయిదు చుక్కల కొబ్బరినూనెను కలిపి ఈ మిశ్రమాన్ని గోరువెచ్చటి నీటికి కలిపి స్నానానికి ఉపయోగించాలి. ఇలా వారంలో రెండుమూడు సార్లు చేయడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగి మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. పాలలోని లాక్టికామ్లం మొటిమలకు కారణమయ్యే సూక్ష్మజీవులతో సమర్థవంతంగా పోరాడుతుంది. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకుని పాలల్లో చిన్న దూది ఉండ ముంచి మొటిమలు ఉండే ప్రాంతంలో మృదువుగా రాయాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పాలల్లో విటమిన్ ఎ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది చర్మాన్ని పొడారిపోకుండా చేస్తుంది.
 
పాలల్లోని లాక్టిక్ ఆమ్లం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది. సూర్యకిరణాల వల్ల కమిలిన చర్మానికి సాంత్వనను చేకూరుస్తుంది. పాలలో దూది ఉండను ముంచి ముఖంపై నెమ్మదిగా, మృదువుగా రాయాలి. పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచు చేస్తుండటం వల్ల మీ చర్మానికి కావలసిన తేమ అందడంతోపాటు మృదువుగా తయారవుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

అలోవెరా జెల్‌తో పగుళ్లు మాయం

పాదాల పగుళ్లను దూరం చేసుకోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి. గ్లిజరిన్, రోజ్ వాటర్‌తో కలిపి ...

news

శీతాకాలంలో చర్మానికి మేలు చేసే వెన్న...

శీతాకాలంలో చర్మానికి వెన్న ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం వున్నవారికి వెన్న ...

news

అందంగా వుండేందుకు ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే....?

అందంగా కనిపించడం కోసం ప్రతీసారి ఖరీదైన క్రీములు కొని వాడాల్సి అవసరం లేదు. ఈ క్రింది ...

news

లేత సూర్య కిరణాలు తలపై పడితే చుండ్రు మాయం

చుండ్రును తొలగించుకోవాలంటే.. కొబ్బరి నూనె చాలు అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. కొబ్బరి ...

Widgets Magazine