Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆనంద్‌తో ఇషా అంబానీ నిశ్చితార్థం

సోమవారం, 7 మే 2018 (13:00 IST)

Widgets Magazine
Isha Ambani

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం ముగిసింది. ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌తో ఈ నిశ్చితార్థం జరిగింది. ఇది ఈషా మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం. ఆనంద్‌, ఇషాలు చిన్ననాటి స్నేహితులు.
 
కొద్దిరోజుల క్రితం మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఆనంద్‌, ఇషాకు ప్రపోజ్‌ చేశారు. ఇషా కూడా అంగీకారం తెలపడంతో అక్కడే ఉంగరాలు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వారి వారి కుటుంబాలకు విషయం చెప్పారు. మఖేష్ కుమారుడు ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతాల వివాహం కంటే ముందే ఆనంద్‌, ఇషాల వివాహం జరిగే అవకాశం ఉంది. 
 
అయితే, ఆనంద్ - ఇషాల పెళ్లి తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. పైగా, దీనిపై ముఖేష్, అజయ్ కుటుంబ సభ్యులు ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా, ఆనంద్‌ పిరమల్ దేశంలో పిరామల్‌ ఈ-స్వాస్థ్య, పిరామల్‌ రియాల్టీ అనే స్టార్టప్ కంపెనీలను ప్రారంభించి, విజయవంతంగా నడుపుతున్న విషయం తెల్సిందే. ఇషా రిలయన్స్ జియో, రిలయన్స్‌ రిటైల్‌ బోర్డుల్లో సభ్యురాలిగా ఉన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
కుమార్తె ఇషా అంబానీ ఆనంద్ పిరమల్ Isha Daughter Anand Piramal ముఖేష్ అంబానీ Mukesh Ambani

Loading comments ...

బిజినెస్

news

పీఎఫ్ పోర్టల్ డేటా లీకైందా? 2.7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారుల వివరాలు?

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారుల వివరాలు హ్యాక్‌కు గురైయ్యాయి. దేశవ్యాప్తంగా 2.7కోట్ల ...

news

తమిళనాడు విద్యుత్ బోర్డుతో భారత్ బిల్‌పే కీలక ఒప్పందం

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) ప్రారంభించిన ఆన్‌లైన్ పేమెంట్స్ ...

news

పెట్రో మంటను భరించాల్సిందే : తేల్చి చెప్పిన కేంద్రం

దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగులపై వినియోగదారులు ...

news

ఆధార్‌ను కొత్త బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయాల్సిందే: ఆర్బీఐ

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు ఆధార్‌ను బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయాలని ...

Widgets Magazine