Widgets Magazine

చదివే పిల్లలకు రాగి జావ ఇస్తే..?

బుధవారం, 13 జూన్ 2018 (14:26 IST)

దీర్ఘకాల అజీర్తి సమస్యలను పరిష్కరించే శక్తి రాగులకు వుంది. రాగుల్లో ఇనుము శాతం ఎక్కువ. దీనిలోని ప్రధాన పోషకాలైన ప్రొలామిన్స్, అమినో ఆమ్లాలు, విటమిన్ బి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగిపిండితో రొట్టెలు, దోశ, పుట్టు, జావ తయారు చేసుకోవచ్చు. దీన్ని పాలు లేదా పెరుగుతో కలిసి తీసుకుంటే పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చదువుకునే పిల్లలకు రాగులను నిత్యం ఏదో ఒక రూపంలో ఇవ్వడం ద్వారా మెదడు చురుగ్గా వుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే అజీర్ణ సమస్యలు తొలగిపోవాలంటే సొరకాయను వంటల్లో చేర్చాలి. బీపీ, కాలేయ సమస్యలు వున్నవారికి ఎంతో మేలు చేస్తుంది. సొరకాయ రసంలో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి నిత్సం తీసుకుంటే మూత్ర సంబంధిత రోగాలను దూరం చేసుకోవచ్చు. 
 
ఇకపోతే.. పిల్లలకు గుమ్మడి గింజలను ఇవ్వడం ద్వారా హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కంటిచూపుకు గుమ్మడి గింజల ద్వారా కలిగే మేలు అంతా ఇంతా కాదు. అరకప్పు గుమ్మడి ముక్కలను రోజూ ఆహారంలో చేర్చుకుంటే.. విటమిన్ సి, ఇ సమృద్ధిగా లభిస్తుంది. వేయించిన గుమ్మడి గింజలను పిల్లల స్నాక్స్ డబ్బాలో నింపడం చేస్తే పిల్లల్లో ఏర్పడే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బాలప్రపంచం

news

వేరీగుడ్.. కానీ.. ఐదుగురు కావాల్రా?

మాస్టర్ : "ఎందుకురా ఇంత ఆలస్యంగా స్కూలుకి వచ్చారు..?" స్టూడెంట్స్ : "ఓ వృద్ధ తాతను ...

news

ఆఁ... ఏముందిరా ఇనుప కిటికీలే కదా...

సోము : "నాన్నా..! సోమూ వాళ్లింట్లో ఎమ్మెస్ విండోస్ వాడుతున్నారట.." తండ్రి : "వాళ్లకంటే ...

news

పిల్లల్లో స్థూలకాయానికి కారణం?

చాలా మంది పిల్లలు స్థూలకాయం (అధిక బరువు)తో బాధపడుతుంటారు. చాలా మంది పుట్టుకతోనే ...

news

స్కూల్‌లో ఏముంది మమ్మీ...

తొలి రోజు కిండర్ గార్డెన్‌కు వెళ్ళిన బాబీ ముఖం వేలాడేసుకుంటూ ఇంటికి వచ్చాడు. అమ్మ : ఏంటి ...

Widgets Magazine