Widgets Magazine

సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన.. సూపర్ హీరో.. అలిస్టర్ కుక్.. గుడ్ బై చెప్పేశాడు..

సోమవారం, 3 సెప్టెంబరు 2018 (18:04 IST)

ఇంగ్లండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పాడు. ఈ నెల 7వ తేదీన భారత్‌తో జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తన క్రికెట్ జీవితంలో చివరి మ్యాచ్‌గా కుక్ అధికారికంగా ప్రకటించాడు. ఇంగ్లాండ్‌ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో కుక్ ఒకరిగా రికార్డు సృష్టించాడు. రెండు దశాబ్ధాలుగా క్రికెట్ ఆడిన కుక్ అద్భుతమైన రికార్డులను సాధించాడు. 
 
అత్యంత పిన్న వయస్సులో టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటిన ఆటగాడిగా కుక్ సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. సచిన్ 31 ఏళ్ల 326 రోజుల వద్ద ఈ మైలురాయిని బద్ధలు కొడితే.. కుక్ 31 సంవత్సరాల 157 రోజుల్లోనే ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు ఇంగ్లాండ్ తరపున పదివేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగానూ నిలిచాడు. అలాగే 160 టెస్టుల్లో 12,254 పరుగులు చేశాడు. ఇందులో 32 శతకాలు, 56 అర్థసెంచరీలు వున్నాయి. 
 
ఇక 92 వన్డేల్లో 3204 పరుగులు చేశాడు.. ఇందులో 5 సెంచరీలు, 19 అర్థసెంచరీలు ఉన్నాయి. అత్యథిక వ్యక్తిగత స్కోరు 137. ఇక పొట్టి క్రికెట్‌లో 4 మ్యాచ్‌లు ఆడి.. 61 పరుగులు చేశాడు. మార్చి 1, 2006లో టెస్ట్ క్రికెట్‌లోకి కుక్ అడుగుపెట్టాడు. 2012లో ఆండ్రూ స్టాస్ నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన కుక్.. 24 టెస్టుల్లో జట్టుకు కెప్టెన్ వ్యవహరించి 24 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్‌లో ఆసీస్‌ను ఓడించి సిరీస్‌ అందించాడు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఒత్తిడిని జయించలేకే ఓడిపోయాం : సౌతాంప్టన్ టెస్ట్ ఫలితంపై కోహ్లీ కామెంట్స్

సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో స్వల్ప విజయలక్ష్యాన్ని ...

news

బాలీవుడ్ హీరోయిన్‌తో క్రికెట్ లవర్ బాయ్ డేటింగ్!

లవర్‌బాయ్‌గా గుర్తింపు పొందిన భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి. ఈయన క్రికెటర్‌గా మాంచి ...

news

ఇంగ్లండ్‌ చేతిలో ఓడిన టీమిండియా.. 3-1తేడాతో టెస్టు సిరీస్‌ గోవిందా..

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ చేజార్చుకుంది. మరో టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే ...

news

ఆసియా క్రికెట్ కప్ : కోహ్లీకి విశ్రాంతి... రోహిత్ శర్మకు సారథ్యం

ఆసియా క్రికెట్ కప్ టోర్నీ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియాను ...

Widgets Magazine