Widgets Magazine

వన్డే ప్రపంచ కప్ : ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన ఐసీసీ

గురువారం, 9 ఆగస్టు 2018 (15:47 IST)

ఇంగ్లండ్, వేల్స్‌లో వచ్చే యేడాది మే 30వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఓ ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఇందులో ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ లీడ్ రోల్‌లో కనిపిస్తున్నాడు. ఈ పాట క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
 
ఈ వీడియోలో ముందుగా ప్రపంచ కప్ మెగా ఈవెంట్ వచ్చేస్తోందంటూ ఫ్లింటాఫ్ వ్యాఖ్యానిస్తాడు. ఆపై విజిల్ వేస్తూ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్ పాటను అందుకుంటాడు. దీంతో ఫ్లింటాప్ వద్దకు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, మహిళా క్రికెటర్ చార్లొటె ఎడ్వర్డ్స్ చేరుకుని సందడి చేస్తారు. 
 
ఈ సందర్భంగా వేర్వేరు దేశాలకు చెందిన జెండాలతో అభిమానులు డ్యాన్స్ చేస్తూ వీధుల్లో తీసుకెళ్తుంటే.. వీరిని చాలామంది ఫాలో అవుతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వచ్చే ఏడాది మే నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌తో పాటు 14 దేశాలు పోటీపడనున్నాయి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
వన్డే ప్రపంచ కప్ ఫ్లింటాఫ్ సాంగ్ ఐసీసీ ట్విట్టర్ చార్లొటె ఎడ్వర్డ్స్ Twitter Icc Andrew Flintoff Promotionals Song Cricket World Cup On Top Of The World

Loading comments ...

క్రికెట్

news

క్రికెట్ ఆడేందుకు వెళ్లారా... హనీమూన్‌కు వెళ్లారా... : నెటిజన్ల ఫైర్

భారత క్రికెట్ జట్టుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ...

news

ఇంగ్లీష్ మహిళా క్రికెటర్‌తో అర్జున్ టెండూల్కర్ డేటింగా?

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్. ఈ బుడతడు తండ్రికి తగ్గ ...

news

సోమర్‌సెట్ క్రికెట్ లీగ్‌.. నో బాల్ వేసిన బౌలర్‌పై విమర్శలే విమర్శలు

సోమర్‌సెట్ క్రికెట్ లీగ్‌లో బ్యాట్స్‌మన్ సెంచరీ చేయకుండా నో బాల్ వేసిన బౌలర్‌పై సోషల్ ...

news

సెహ్వాగ్ ఫైర్.. ఉమ్మడి కుటుంబంలో సంతోషం వుండదా? ఏంటి చెత్త చదువు?

డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చురుగ్గా వున్న సంగతి తెలిసిందే. ...

Widgets Magazine