Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

191 బంతుల్లోనే 300 రన్స్.. ఎవరు... ఎక్కడ? (వీడియో)

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (12:50 IST)

Widgets Magazine
Marco Marais

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఒకరు చరిత్రను తిరగరాశాడు. కేవలం 191 బంతుల్లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదాడు. ఫలితంగా 96 యేళ్లనాటి రికార్డు బద్దలైపోయింది. ఆ క్రికెటర్ పేరు మార్కో మరాయిస్. సౌతాఫ్రికా ఫస్ట్ క్లాస్ క్రికెటర్. 
 
సౌతాఫ్రికా సెకండ్ టైర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో భాగంగా బోర్డర్ టీమ్‌ తరపున ఆడిన మరాయిస్.. ఈస్టర్న్ ప్రావిన్స్ టీమ్‌పై ఈ ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. తమ జట్టు 82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన మరాయిస్.. సంచలనానికి తెరలేపాడు. మరో బ్యాట్స్‌మన్ బ్రాడ్లీ విలియమ్స్ (113)తో కలిసి 428 పరుగులు జోడించాడు. మరాయిస్ తన 191 బంతుల ఇన్నింగ్స్‌లో 35 ఫోర్లు, 13 సిక్స్‌ర్లను బాదాడు. 
 
గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన చార్లీ మకార్ట్‌నీ పేరుపై ఉండేది. 1921లో ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌షైర్‌పై 221 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. అదే ఇప్పటివరకు రికార్డు. ఈ రికార్డును మరాయిస్ తిరగరాసి సరికొత్త చరిత్రను లిఖించాడు. ఫలితంగా వరల్డ్ క్రికెట్‌లో సంచలనమయ్యాడు. 


 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఆస్ట్రేలియా రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సరికొత్త రికార్డుపై కన్నేశాడు. అదీకూడా ...

news

బీసీసీఐకి రూ.52కోట్ల భారీ జరిమానా.. సచిన్ జెర్సీ 10కు వీడ్కోలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికట్ ప్రసార హక్కుల కేటాయింపుల విషయంలో బీసీసీఐకి భారీ జరిమానా ...

news

బీసీసీఐకు షాకిచ్చిన కాంపిటిషన్ కమిషన్.. ఎందుకు?

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాంపిటిషన్ కమిషన్ షాకిచ్చింది. ఐపీఎల్ మీడియా ...

news

భారత బౌలర్లధాటికి ఉక్కిరిబిక్కిరయ్యాం : లంక కెప్టెన్

నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు చిత్తుగా ఓడింది. ...

Widgets Magazine