గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By selvi
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (15:51 IST)

2019లో ఏపీకి పవన్ సీఎం.. ఆ ముగ్గురు కలిసి అంతా చేస్తారట: తమ్మారెడ్డి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2019లో ఏపీ సీఎంగా కావడం ఖాయమని సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడ టూర్ వెళ్లినప్పుడు ఆటో డ్రైవర్‌తో మాటలు కలిపిన సంగతులను తమ్మారెడ్డి సోష

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2019లో ఏపీ సీఎంగా కావడం ఖాయమని సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడ టూర్ వెళ్లినప్పుడు ఆటో డ్రైవర్‌తో మాటలు కలిపిన సంగతులను తమ్మారెడ్డి సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు. 
 
విజయవాడ నుంచి నాచారం వెళ్లేందుకు ఆటో ఎక్కామని.. అతని ఆటో మొత్తం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫోటోలు, చేతిపై పవన్ పచ్చబొట్టు వున్నాయని తమ్మారెడ్డి చెప్పారు. అలాగే అతనితో మాటామాటా కలిపేసరికి.. తానో జనసేన సైనికుడని స్ట్రాంగ్‌గా చెప్పాడని తమ్మారెడ్డి అన్నారు. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవిని మీలాంటోళ్లు రాజకీయాల్లోకి లాగి ముంచేశారని అంటే.. అది వదిలేయండి సార్.. ఏపీకి 2019లో సీఎం అవుతాడని చెప్పాడు. 
 
పవన్ సీఎం అవుతాడని అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు అని ఆటో డ్రైవర్‌ని అడిగితే.. "ఎలాగేంటి సార్? టీడీపీ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోతుంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేయడంతోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టి. సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఎన్నికల సమయానికి కేసీఆర్ ఓటుకు నోటు కేసును లేవనెత్తితే.. ఏపీ సీఎం చంద్రబాబు జైలుకెళ్తారు. అక్రమాస్తుల కేసులో జగన్ కూడా జైలు పాలవుతారు. అప్పటికి కేసీఆర్, అమిత్ షా, పవన్ ఈ ముగ్గురు కలిసి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఓ కొలిక్కి తెస్తారని" సాధారణ ఆటో డ్రైవర్ చెప్తుంటే షాక్ అయ్యానని తమ్మారెడ్డి చెప్పారు. అదెలా బాబూ.. బీజేపీ, టీడీపీ ఒకటే కదా.. అని తాను ప్రశ్నిస్తే.. బీజేపీ స్కెచ్ వేరని ఆటో డ్రైవర్ అన్నాడు. 
 
బీజేపీ నేతలు అమాయకంగానే వుంటారు. కనిమొళిని, రాజానే 2జీ కేసు నుండి విడిపించారు. వాళ్లకు వ్యతిరేకంగా వున్న లాలూ ప్రసాద్ యాదవ్‌ను లోపలేసేశారని చెప్పాడు. మరి బీజేపీ కలిస్తే జగన్‌తో కలుస్తారు కానీ.. పవన్‌తో  ఎందుకు కలుస్తారని తాను ప్రశ్నిస్తే.. మీరెక్కడున్నార్ సార్.. పవన్ అయితే బీజేపీ 40 సీట్లు పోటీ చేయవచ్చు. అది మాకు మంచిదే కదా. ఎన్నికల్లో గెలవాలంటే మాకు డబ్బు అవసరం. అది వాళ్లే చూసుకుంటారు. అప్పుడు పవన్ కల్యాణ్ సీఎం కావడం గ్యారంటీ. ఏపీలో బీజేపీ బలం పెరుగుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. అక్కడ అంటే తెలంగాణ టీడీపీ తుడుచుకుపోతుందని ఆటోడ్రైవర్ తనకు తెలిసిన విషయాన్ని నిజాయితీగా చెప్పినట్లు తమ్మారెడ్డి అన్నారు.
 
ఆ ఆటో డ్రైవర్ నిజాయితీగానే డబ్బులు తీసుకున్నాడని తమ్మారెడ్డి వెల్లడించారు. ఆటో డ్రైవర్ చెప్పడాన్ని బట్టి జనసేనాని ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీతో కలిసి సీఎం అవుతాడని, టీడీపీ తెలంగాణలో తుడుచుకుపోతుందని చెప్తున్నాడు. అమిత్ షా, కేసీఆర్, పవన్ ఈ ముగ్గురు కలిసి ఆంధ్ర, తెలంగాణ రాజకీయాలను ఓ కొలిక్కి తెస్తారని ఆటో డ్రైవర్ చెప్పడం నిజంగానే షాక్ ఇచ్చిందని తెలిపారు. ఎవ్వరికీ ఏమీ తెలియదని అనుకుంటుంటాం. మనమే మేధావులం అనుకుంటాం. కానీ సామాన్య పౌరుడికి ఎంత తెలుసో.. వాళ్లెలా రాజకీయ నాయకులను అర్థం చేసుకుంటారో ఆట్రో డ్రైవర్‌ని చూసి తెలుసుకున్నానని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.