Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దీపావళి లోపు ఈ వస్తువులుంటే పడేయండి..

సోమవారం, 9 అక్టోబరు 2017 (14:06 IST)

Widgets Magazine
glass break

దీపావళి అంటే దీపాల పండుగ.. ఇలాంటి పండుగ కోసం చిన్నపిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. దీపాలు వెలిగించి బంధువులతో కలిసి టపాసులు కాల్చవచ్చని అనుకుంటుంటారు. కానీ పెద్దవారు మాత్రం ఆరోజు లక్ష్మీదేవిని పూజించి ఇంటిలోకి ఆహ్వానించాలని అనుకుంటుంటారు. దీపావళి లక్ష్మీదేవి పుట్టినరోజు అని పెద్దలు చెబుతుంటారు. 
 
లక్ష్మీదేవి పుట్టినరోజు విష్ణుమూర్తి నీకేం కావాలని అడిగితే నేను భూలోకానికి నేరుగా వెళ్ళి అంతా చూడాలనే కోరిక ఉందని చెప్పిందట. విష్ణుమూర్తి సరేనని పంపారు. అలా ప్రతి దీపావళి రోజు లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వస్తుంది. 
 
లక్ష్మీదేవికి శుభ్రంగా వున్న ఇల్లు అంటే చాలా ఇష్టం. అందుకే దీపావళికి ముందు నాలుగు రోజుల నుంచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదు.. పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. పగిలిన అద్దం ఇంట్లో ఉంచితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటమే కాకుండా మనస్ఫర్థలు వస్తాయి. ఇంట్లో మంచం విరిగి ఉన్నా శబ్దాలు వస్తున్నా వాటిని బాగు చేయించాలి..లేకుంటే బయట పడేయాలి. 
 
ఆగిపోయిన గడియారం.. విరిగిన గడియారం ఉంటే పడేయాలి.. లేకుంటే ఏ పని మొదలెట్టినా ఆటంకాలు వస్తాయి. చెద పట్టిన ఫోటోలు ఉంటే బయట పడేయాలి. ఇంటి ముఖ ద్వారానికి రిపేర్లు ఉంటే చేయించాలి. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు విరిగిపోయి వుంటే వాటిని కూడా పడవేయాలి. చిరిగిన బట్టలు పడవేయాలి. ఇవన్నీ ఇంట్లో ఉంటే లక్ష్మి ఇంటికి రాదు. గత యేడాది వాడిన దీపాలను మళ్ళీ వాడకూడదు. ఎవరి శక్తికొద్దీ వారు కొత్త దీపాలను కొనుగోలు చేసి దీపావళిని చేసుకుంటే మహాలక్ష్మి కటాక్షిస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

అయ్యప్పస్వామి దేవాలయంలో దళిత పూజారులు..

కేరళ ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు (టీడీబీ) ఆధ్వర్యంలోని దేవాలయాల్లో దళిత పూజారులు ...

news

దీపావళి: ఆ మూడు రోజుల్లో దీపదానం చేస్తే?

దీపావళికి ముందు రోజు నరకచతుర్దశి.. అంతకుముందు ధనత్రయోదశిని ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాతి ...

news

ఉదయం 4.30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య దీపం వెలిగిస్తే....

దీపం వెలిగించడమంటే దేవుడిని ఆరాధించడమే. దీపారాధనను శాస్త్రోక్తంగా చేయాలి. అది దీపం ...

news

శిలా మూర్తికి శిరసా నమామి..!

తిరుమల క్షేత్రం... కలియుగ వైకుంఠం. తిరుమల కొండల్లోని చెట్టూ, పుట్టా... రాయీ, రప్ప... ఆ ...

Widgets Magazine