Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఢిల్లీలో ఈసారి నిశ్శ‌బ్ద‌ దీపావళి..? బాణసంచాపై మళ్లీ నిషేధం!

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (06:27 IST)

Widgets Magazine
firecrackers

దేశ రాజధాని దిల్లీలో గతేడాది బాణసంచాపై విధించిన నిషేధాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనుంది. 
 
పండగలు, ప్రత్యేక సందర్భాల్లో పెద్దమొత్తంలో బాణసంచా ఉపయోగిస్తుండటంతో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోంది. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొంటూ గతేడాది నవంబర్‌లో ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో బాణసంచాపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. 
 
బాణసంచాలను విక్రయించే టోకు, చిల్లర వ్యాపారుల లైసెన్సులను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. కాలుష్యం దృష్ట్యా బాణసంచా విక్రయ లైసెన్సులను సగానికి తగ్గించేలా చూడాలని పోలీసులను ఆదేశించింది. 
 
తాజాగా ఈ నిషేధాన్ని తిరిగి కొనసాగించాలని కోరుతూ అర్జున్‌ గోపాల్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించింది. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టనున్నట్లు జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెలుగుదేశంలో చేరడం లేదు... వైసీపీలోనే కొనసాగుతా.. బుట్టా రేణుక

తాను టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలపై వైసీపీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. ఈ ...

news

ఏ దేవుడు చెప్పులు లేకుండా నడిచాడో బ్రాహ్మణులు చెప్పాలి: ఐలయ్య

సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఓయూలో ప్రసంగిస్తూ.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు ...

news

ఎస్పీ అధినేతగా అఖిలేష్.. ములాయంకు షాక్

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడిగా ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ ...

news

జనసేనకు జెండానే లేదు.. మంత్రి పితాని సత్యనారాయణ

హీరో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి రాష్ట్రంలో జెండానే లేదనీ రాష్ట్ర మంత్రి ...

Widgets Magazine