బరువు తగ్గడం కోసం మధ్యాహ్న భోజనం మానేస్తున్నారా?

మంగళవారం, 31 అక్టోబరు 2017 (12:32 IST)

food eating

బరువు తగ్గడం కోసం మధ్యాహ్న భోజనాన్ని మానేస్తున్నారా? అయితే ఈ కథనం చదవండి. దీనితో ప్రయోజనం శూన్యమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడిలో పడి.. మధ్యాహ్న భోజనం మానేస్తే... శరీరానికి అలసట తప్పదు. మధ్యాహ్న భోజనాన్ని మానేస్తే.. అసిడిటీ వంటి సమస్యలు తప్పవు. ఎందుకంటే భోజనం తర్వాత దాదాపు రెండు గంటల వరకూ కూడా మనలో జీవక్రియలు వేగవంతమవుతాయి. 
 
భోజనం మానేస్తే ఇవి మందగిస్తాయి. మధ్యాహ్న భోజనాన్ని మానేస్తే సాయంత్రానికి స్నాక్స్ తెగ లాగిస్తారు. దీంతో క్యాలరీల మోతాదూ పెరిగిపోతుంది. ఆఫీసుల్లో సాయంత్రం టీ సమయంలో సమోసాలు, పకోడీల వంటి నూనెలతో నిండిన రకరకాల పదార్థాలను ఎక్కువ తింటే.. బరువు పెరగడం ఖాయం. మధ్యాహ్నం పూట ఆహారం తీసుకోని వారు రాత్రి పూట మరీ ఎక్కువ భోజనాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే మధ్యాహ్నం తీసుకునే ఆహారాన్ని పక్కనబెట్టకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అసలే వర్షాకాలం.. ఆహారంలో శుభ్రత అవసరం.. ఈ టిప్స్ పాటించండి

అసలే వర్షాకాలం.. తీసుకునే ఆహారంలో శుభ్రత అవసరం. మనం తీసుకునే ఆహారం కలుషితమైతే.. ...

news

భోజనానికి ముందు వెజ్ జ్యూస్ తాగితే ఏమౌతుంది...?

బరువు తగ్గాలా? వర్షాకాలంలో ఏర్పడే రుగ్మతల నుంచి దూరం కావాలా అయితే భోజనానికి ముందు ఒక ...

news

ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుంటున్నారా? కీళ్ల నొప్పులకు ఇలా చేయండి..

ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుంటున్నారా..? కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వీటి ...

news

భోజనం తరువాత ఒక్క స్పూన్ సోంపు తింటే...?

సోంపుకు కొలెస్ట్రాల్‌కు ఉన్న లింకేంటి. సోంపు అంటే కొంతమంది ఇష్టపడతారు... మరికొంతమంది ...