శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (14:56 IST)

ఉసిరికాయ ఊరగాయ రాత్రిపూట తినకూడదా?

ఉసిరికాయ ఊరగాయను తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రోజూ తీసుకునే ఆహారంలో ఆమ్లా తీసుకుంటే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధికారకాలపై ఆమ్లా పోరాడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే వర్షాకాలంలో జలుబు, దగ్గు వంటి రుగ్మతల నుంచి కాపాడుతుంది.
 
అలాగే జుట్టు రాలడం తగ్గిపోతుంది. శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సంతాన సమస్యలను దూరం చేస్తుంది. వాత, పిత్త, కఫ రోగాలను దూరం చేస్తుంది. అయితే రాత్రి పూట మాత్రం ఉసిరికాయను, ఉసిరి ఊరగాయను తీసుకోకూడదు. ఉసిరిలోని సి విటమిన్ పేగుల్లో ఆమ్లాన్ని పెంచుతుంది. 
 
రాత్రిపూట ఆమ్లాలు తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణం కాదు. అజీర్తివల్ల గుండె మంట వంటివి కలుగవచ్చు. అంతేగాకుండా ఉసిరికాయ శక్తిని ప్రేరేపిస్తుంది. రాత్రిపూట ఉసిరికాయ తినడం వల్ల అందులోని శక్తి ప్రేరేపకం మనల్ని సుఖనిద్రకు దూరం చేస్తుంది. రక్తప్రసరణ వేగవంతం కావడం వల్ల కొందరికి ఆందోళన కలుగవచ్చు. అందుకని రాత్రిపూట ఉసిరికాయ తినకూడదని చెప్తారు.