డయాబెటిస్ తగ్గాలంటే.. పెరుగు తీసుకోవాల్సిందే.. కానీ ఆ రెండు..?

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (10:00 IST)

మధుమేహాన్ని దూరం చేసుకోవాలంటే రోజువారీ ఆహారంలో పెరుగును తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొవ్వు త‌క్కువగా ఉన్న పెరుగుని తీసుకోవ‌టం ద్వారా శ‌రీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది షుగర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అలాగే చీజ్‌లోనూ ఇలాంటి ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇదేవిధంగా రోజూ స్ట్రాబెర్రీస్‌ను తీసుకోవం ద్వారా ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని, కొవ్వుల‌ను త‌గ్గించే శ‌క్తిని పొందవచ్చు. ఈ పండ్ల ద్వారా ప్రొటీన్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌, కొవ్వులు త‌గ్గ‌ుతాయి. దీంతో మ‌ధుమేహం ముప్పు త‌గ్గుతుంది. దాల్చిన చెక్క పొడిని టీలో చేర్చుకుని తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుముఖం పడుతుంది. దాల్చిన చెక్కలోని ట్రైగ్లిజ‌రైడ్స్ అనే కొవ్వుల‌ను, చెడు కొలెస్ట్రాల్‌ని త‌గ్గించి ఇన్సులిన్‌ ప‌నితీరుని మెరుగుప‌రుస్తుంది. 
 
అలాగే రోజుకొకటి చొప్పున యాపిల్ తీసుకోవాలి. ఇందులోని అంథోసియానిన్ ర‌క్తంలోని షుగ‌ర్ లెవ‌ల్స్‌ని క్ర‌మ‌బ‌ద్ధం చేస్తుంది. పాలకూర తింటే మధుమేహం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
అయితే అరటి పండ్లు, ఖర్బూజలను మాత్రం మధుమేహంతో బాధపడేవారు తీసుకోకూడదు. ఇందులోని విటమిన్స్, ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేసినా.. వీటిలో షుగర్ శాతం ఎక్కువగా వుండటం ద్వారా డయాబెటిస్ పేషెంట్లకు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గుమ్మడి చేసే మేలు... స్త్రీలకు, పురుషులకు...

తెలుగువారి యింటి ముంగిట గుమ్మడిపండును వ్రేలాడదీయడం మనం నిత్యం చూస్తాము. బూడిదగుమ్మడిలో ...

news

ఖర్జూర పండును తింటే కలిగే ప్రయోజనం ఏంటి?

1. ఖర్జూరపండులో ఎక్కువ పీచు పదార్థం వుంటుంది. 2. మూత్రం సాఫీగా కానివారికి ఖర్జూరపండు ...

news

ఆయిలీ స్కిన్‌.. బ్లాక్ హెడ్స్‌కు చెక్ పెట్టే కొత్తిమీర..

కొత్తిమీర వంటకాలకు మంచి వాసనను ఇవ్వడమే కాకుండా బరువును తగ్గించడంలో దివ్యౌషధంగా ...

news

శాకాహారం తీసుకోంటే ఆ సమస్యలుండవ్?

మాంసాహారంతో శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభించినా.. కేవలం శాకాహారం తీసుకోవడం ద్వారా ...