Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శెనగలను స్నాక్స్ తీసుకుంటే మధుమేహం పరార్

సోమవారం, 8 జనవరి 2018 (16:24 IST)

Widgets Magazine
Chickpeas

శెనగలను స్నాక్స్‌గా తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శెనగలను ఉడికించి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల్లోపు తీసుకోవాలి. స్నాక్స్‌గా బజ్జీలు వంటి ఇతరత్రా నూనె పదార్థాలు తీసుకోవడం కంటే శెనగలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. శెనగల్లో క్యాల్షియం, ఇనుము, పొటాషియం, పీచు సమృద్ధిగా లభిస్తాయి. 
 
అంతేగాకుండా వీటిలోని మాంగనీస్‌, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో సహాయపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. చిన్నారులకు ప్రతిరోజూ వీటితో చేసిన స్నాక్స్‌గా ఇవ్వడం మంచిది. అలాగే మధుమేహం వున్నవారికి కూడా శెనగలు ఎంతో మేలు చేస్తాయి. రక్తంలోని గ్లూకోజ్ స్థాయుల్ని శెనగలు పెంపొందింపజేస్తాయి. తద్వారా డయాబెటిస్ దరిచేరదు.
 
రక్తహీనత తొలగిపోతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శెనగల్లో వుండే పోషకాలు గుండెకు బలాన్నిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు శెనగలను రోజూ కప్పు తీసుకోవచ్చు. ఇందులో వుండే ఫాలేట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రాత్రిపూట పిల్లలకు టీ, కాఫీలు ఇస్తున్నారా?

రాత్రిపూట చదువుకునే పిల్లలకు టీ, కాఫీలు ఇస్తున్నారా? ఇక మానేయండి. టీ, కాఫీలు పిల్లలకు ...

news

గరిక లేదా గోధుమ గడ్డి లేదా అలోవెరా జ్యూస్ తాగితే..?

గరిక లేదా గోధుమ గడ్డి, కలబంద జ్యూస్ తాగితే బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ...

news

చింతపండుతో అంత మేలా?

చింతపండు పులుపు. ఎక్కువ వాడకండి అంటుంటారు చాలామంది. అయితే చింతపండు గుజ్జులో ఫైబర్ అధికంగా ...

news

మధుమేహానికి మేలు చేసే తోటకూర

మధుమేహానికి తోటకూర ఎంతో మేలు చేస్తుంది. రోజూ తోటకూరను ఆహారంలో భాగం చేసుకున్నా ఫలితం ...

Widgets Magazine