శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (16:45 IST)

శుభ్రత లేని హోటళ్లలో తినొద్దు.. తింటే వ్యాధులు తప్పవండోయ్...

వీకెండ్ అయితే చాలు ఏదైనా హోటల్‌కు వెళ్ళాలనుకుంటాం. బాగా వెరైటీలు లాగించేస్తుంటాం. నాన్ వెజ్ వంటకాలంటేనే లొట్టలేసుకుని తినేస్తుంటాం. కానీ హోటళ్లలో, రెస్టారెంట్లలో శుభ్రత గురించి పెద్దగా పట్టించుకోం. డబ

వీకెండ్ అయితే చాలు ఏదైనా హోటల్‌కు వెళ్ళాలనుకుంటాం. బాగా వెరైటీలు లాగించేస్తుంటాం. నాన్ వెజ్ వంటకాలంటేనే లొట్టలేసుకుని తినేస్తుంటాం. కానీ హోటళ్లలో, రెస్టారెంట్లలో శుభ్రత గురించి పెద్దగా పట్టించుకోం. డబ్బులు పోసి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటుంటాం.. నాన్ వెజ్ అంటేనే ఇంట్లో తయారు చేసే వంటకాల కంటే హోటళ్లలోనే ఎక్కువ ఇష్టపడుతుంటాం. కానీ ఇక హోటల్ ఫుడ్‌ను పక్కనబెట్టడం మంచిదని సూచిస్తున్నారు.. ఆరోగ్య నిపుణులు.
 
ఎందుకంటే..? రెస్టారెంట్లు, హోటళ్లలో వాడే మాంసంలో నాణ్యత కొరవడుతోందని.. చెన్నైలోని హోటళ్లలో పిల్లుల మాంసాన్ని బిర్యానీల్లో వాడేస్తున్నారని వార్తలొచ్చాయి. మాంసాహార ప్రియుల బలహీనతను రెస్టారెంట్, హోటల్ యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని హోటళ్లలో శుభ్రత సరిగ్గా లేదని, లైసెన్సులు కూడా లేవని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. అందుచేత నాణ్యత గల ఆహారం తీసుకోవాలంటే.. రెస్టారెంట్ల వెనుక పరుగులు తీయకుండా..