బబుల్‌గమ్ తింటూ నడిస్తే...?

బబుల్‌గమ్ తినడం మంచిది కాదన్నది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు అదే మంచిదంటున్నారు జపాన్ పరిశోధకులు. నడుతుస్తూ బబుల్‌గమ్ తింటే హార్ట్‌బీట్ మెరుగుపడడమే కాకుండా ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. జపాన్ పరిశోధకులు 2

Kowsalya| Last Updated: శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (17:29 IST)
బబుల్‌గమ్ తినడం మంచిది కాదన్నది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు అదే మంచిదంటున్నారు జపాన్ పరిశోధకులు. నడుతుస్తూ బబుల్‌గమ్ తింటే హార్ట్‌బీట్ మెరుగుపడడమే కాకుండా ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. జపాన్ పరిశోధకులు 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సుగల కొంతమంది స్త్రీ పురుషులమీదు వీరు అధ్యయనం చేశారు.

 
కొందమందికి బబుల్‌గమ్ ఇచ్చి పావుగంటపాటు నడవమన్నారు. మిగిలిన వారికి ఇతర ఆహార పదార్థాలు ఇచ్చి వాటిని తింటూ నడవమన్నారు. ఇలా కొన్నిరోజుల పాటు నడిచిన తరువాత వీరి బరువును పరిశీలించి చూస్తే బబుగ్‌గామ్ తింటూ నడిచిన వారి బరువులో మాత్రమే మార్పును గమనించారు. 
 
ఇతర ఆహర పదార్థాలు తిన్న వారిలో ఎలాంటి మార్పు లేదు. బబుల్‌గమ్ తింటూ నడవడం వలన నడకలో వేగం పెరుగుతుందనీ, దీనివలన సుమారు మూడు నుండి ఆరు క్యాలరీలు ఖర్చవుతాయని పరిశోధలలో వెల్లడైంది. 


దీనిపై మరింత చదవండి :