చెమటతో వళ్లు తడిసిపోతే దుర్గంధం.... కానీ అది రాస్తే పరిమళం...

చెమట వాసన రాకుండా వుండేందుకు చాలామంది పెర్‌ఫ్యూమ్స్ వాడుతుంటారు. ఇన్ని వాడుతున్నా కొందరిలో చెమట దుర్గంధం మాత్రం ఇబ్బంది పెడుతూనే వుంటుంది. అలాంటివారికోసం... అంటే ఎంత ఎక్కువ చెమట పట్టినా ఆ వాసన రాకుండా అడ్డుకట్ట వేయగల పెర్‌ఫ్యూమ్ వచ్చేసింది. దీనిని బె

perfume
chj| Last Modified మంగళవారం, 5 డిశెంబరు 2017 (13:20 IST)
చెమట వాసన రాకుండా వుండేందుకు చాలామంది పెర్‌ఫ్యూమ్స్ వాడుతుంటారు. ఇన్ని వాడుతున్నా కొందరిలో చెమట దుర్గంధం మాత్రం ఇబ్బంది పెడుతూనే వుంటుంది. అలాంటివారికోసం... అంటే ఎంత ఎక్కువ చెమట పట్టినా ఆ వాసన రాకుండా అడ్డుకట్ట వేయగల పెర్‌ఫ్యూమ్ వచ్చేసింది. దీనిని బెల్ ఫాస్టుకు చెందిన క్వీన్స్ యూనివర్శిటీ నిపుణులు కనుగొన్నారు.

ఈ అత్తరు శరీరానికి పూసుకున్న తర్వాత, తేమ ఎంత ఎక్కువగా వుంటే అంతగా సువాసనలు వెదజల్లుతుంది. అంటే... చమట ఎంత ఎక్కువపోస్తే అంత ఎక్కువగా సువాసనలు వెదజల్లుతుంది. ఇందుకుగాను ముడి తైలాన్ని అయానిక్ ద్రవ రూపంలో తయారుచేస్తారట. ఆ స్థితిలో దానికి ఎలాంటి వాసన వుండదు. దానికి తేమ తగిలితే మాత్రం వెంటనే గుభాళిస్తుంది. ప్రస్తుతం ఈ పెర్‌ఫ్యూమ్స్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :