శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (11:57 IST)

పాలను కలిపిన టీని సేవిస్తున్నారా?

తేయాకు మంచిదే. అందుకే రోజుకు రెండు కప్పుల టీ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తేయాకులోని యాంటీ-యాక్సిడెంట్లు శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. అలాగే టీని సేవించడంతో పాటు గ్రీన్ టీని కూడా సేవించడం ద

తేయాకు మంచిదే. అందుకే రోజుకు రెండు కప్పుల టీ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తేయాకులోని యాంటీ-యాక్సిడెంట్లు శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. అలాగే టీని సేవించడంతో పాటు గ్రీన్ టీని కూడా సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. తేయాకులోని పాలీఫినాల్స్‌, అమైనో ఆమ్లాలు, విటమిన్ల కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. 
 
తేయాకు క్యాన్సర్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. తేయాకులోని యాంటీ యాక్సిడెంట్లు రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. రోజుకు రెండు లేదా మూడు కప్పుల టీని తీసుకుంటే క్యాన్సర్‌ను నిరోధించవచ్చు. అయితే తేయాకులో పాలను కలుపుకుని తీసుకోకుండా.. తేయాకును నీటిలో మరిగించి తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
టీలో పాలను చేర్చడం వల్ల పాలలోని ప్రోటీన్లు టీలో యాంటీ-యాక్సిడెంట్లను చుట్టేస్తాయి. దీంతో పాలను చేర్చిన టీ నిరూపయోగం అవుతుంది. అందుకే పాలు లేకుండా తేయాకుతో టీ తయారు చేసుకోవాలి. అదీ సన్నని సెగపై కాచితే మరీ మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.